టెలిగ్రామ్ లో కూడా వాయిస్ టు టెక్స్ట్..ఎప్పటి నుంచో తెలుసా?

ప్రతిరోజు నిత్యం వేలాది మంది ఉపయోగించే సోషల్ మీడియా యాప్ లలో టెలిగ్రామ్ కూడా ఒకటి. ఈ టెలిగ్రామ్ యాప్ 2013 లోనే ప్రారంభం అయినప్పటికీ ఈ ఫీచర్ ని ఉపయోగించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది.

టెలిగ్రామ్ ఒక మెసేజింగ్ యాప్. దీనికి ఇంటర్నెట్ ఉంటే చాలు.ఉచితంగా సందేశాలు పంపుకోవచ్చు. వీడియోల్ని సెకన్లలో పంపేయొచ్చు. ఆడియో ఫైల్స్‌ను కూడా క్షణాల్లో కోరుకున్న వారికి పంపేయొచ్చు.ఈ మధ్యకాలంలో భారతదేశంలో కూడా దీనిని ఉపయోగించే వినియోగదారులు ఎక్కువయ్యారు.ఇతరులు చూడకుండా ఈ సేవ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్. ఆండ్రాయిడ్ ఫోన్లో కొరకు 14 ఆగస్టు 2013 విడుదల చేశారు.

కానీ టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరుగుతుండడంతో క్రమంగా ఈ టెలిగ్రామ్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే 2013లో ప్రారంభమైన టెలిగ్రామ్ తొమ్మిదేళ్లపాటు వినియోగదారులకు ఉచిత సేవలను అందిస్తూనే ఉంది. టెలిగ్రామ్ లో అదునాతనమైన ఫీచర్స్ తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోని ఈ మధ్యకాలంలో టెలిగ్రామ్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కాగా టెలిగ్రామ్ సంస్థ తాజాగా మరొక సరికొత్త ఫ్యూచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. టెలిగ్రామ్ లో వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ వల్ల ఎన్నో లాభాలు ఉండడంతో పాటు ఈజీగా వాయిస్ మెసేజ్ చేయడంతో పాటు వాయిస్ టెక్స్ట్ రూపంలో కూడా పంపించవచ్చని ఇంస్టాగ్రామ్ సంస్థ వెల్లడించింది. ఈ ఫీచర్ ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయానికి వస్తే.. సాధారణంగా చాలామంది ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు లేదా కుటుంబ సభ్యులు ఉన్న ప్రదేశాలలో వాయిస్ మెసేజ్ పంపడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వారు ఈ వాయిస్ టు టెక్స్ట్ మెసేజ్ ద్వారా వారు చెప్పాలి అనుకుంటున్నా అసలు విషయాన్ని చెప్పవచ్చు.

టెలిగ్రామ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి 1 బిలియన్ కంటే ఎక్కువ అంటే 100 కోట్ల సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ చెబుతున్న దాని ప్రకారం మెసేజింగ్ యాప్‌లో 2021 ప్రారంభంలో 500 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. గత 15 రోజుల్లో చాలా మంది వినియోగదారులు టెలిగ్రామ్‌లో చేరారు. ఈ సమయంలో 70 మిలియన్లకు పైగా (70 మిలియన్లు) వినియోగదారులు టెలిగ్రామ్‌కు కనెక్ట్ అయ్యారని డ్యూరోవ్ చెప్పారు

టెక్స్ట్ సైజుని మనకు ఇష్టం వచ్చిన విధంగా సరి చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ హోం స్క్రీన్ పైనే ఉంటుంది. అలాగే ఎమోజీ విషయంలో కొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది ఇంస్టాగ్రామ్ సంస్థ. మనం ఎవరికైనా ఎమోజిని పంపితే దానికి సంబంధించిన రియాక్షన్ ఎమోజీలు కూడా స్క్రీన్ మీద మనకు కనిపిస్తాయి. టెలిగ్రామ్ లో 12 రకాల కష్టమైజ్డ్ ఇమేజిలతో పాటుగా స్టిక్కరింగ్ ప్యాక్ ను కూడా తీసుకువచ్చింది ఇంస్టాగ్రామ్ సంస్థ. టెలిగ్రామ్ లో ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అనగా ఇంస్టాగ్రామ్, స్నాప్ చాట్, ఫేస్బుక్ ని కూడా బయోలో పెట్టుకోవచ్చు. వాటీని క్లిక్ చేయడం ద్వారా ఆ సైట్లకు వెళ్ళవచ్చు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *