యూపీఐ పేమెంట్స్‌ చేసే వారికి గుడ్‌ న్యూస్‌.. వాయిస్‌ కమాండ్స్‌తో సేవలు పొందే అవకాశం..

ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్ లావాదేవీలు అని అందరికి తెలిసిన విషయాలే ఇంతకు ముందు అయితే ఎవరికీ ఏమైన చెల్లింపు చేయాల్సిన బ్యాంక్‌కి డబ్బు క్రెడిట్ చేయాలన్న బ్యాంక్‌కి వెళ్లి వెయాల్సి వచ్చింది కానీ ఈ యూపీఐ ప్రాసెస్ వచ్చినప్పటినుండి డబ్బు అనేధి ఈజీగా సురక్షితంగా బదిలీ చేయబడుతుంది

యూపీఐ పేమెంట్:- యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది వినియోగదారులను ఒకే స్మార్ట్‌ఫోన్ యాప్‌లో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను లింక్ చేయడానికి మరియు IFSC కోడ్ లేదా ఖాతా నంబర్‌ను అందించాల్సిన అవసరం లేకుండా ఫండ్ బదిలీలను చేయడానికి అనుమతించే చెల్లింపు వ్యవస్థ. ఇది నిజ-సమయ చెల్లింపు వ్యవస్థ, ఇక్కడ నిధులు నిజ-సమయ ప్రాతిపదికన తక్షణమే జమ చేయబడతాయి.

UPI అత్యంత సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది. వినియోగదారులు ముందుగా బ్యాంక్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌నే ఉపయోగించి UPIలో నమోదు చేసుకోవాలి. సురక్షిత ప్లాట్‌ఫారమ్ ఉన్నప్పటికీ, లావాదేవీల కోసం UPIని ఉపయోగిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండకపోతే మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి.

పేమెంట్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు లావాదేవీల తీరు పూర్తిగా మారిపోయింది. ఒక్క క్లిక్‌తో ఒకరి నుంచి మరొకరికి డబ్బులు సింపుల్‌గా పంపించుకుంటున్నారు.

అయితే ప్రారంభంలో యూపీఐ సేవలు కేవలం స్మార్ట్‌ఫోన్‌లో ఉండే పేమెంట్‌ యాప్స్‌ ద్వారా మాత్రమే చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఆ తర్వాత ఫీచర్‌ ఫోన్‌ యూజర్లకు కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫీచర్‌ ఫోన్‌ను ఉపయోగించే వారు కూడా చిన్న చిన్న కమాండ్స్‌తో యూపీఐ సేవలను పొందుతూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఫీచర్‌ ఫోన్‌ యూజర్ల కోసం యూపీఐ పేమెంట్స్‌లో మరో అద్భుత ఫీచర్‌ను తీసుకొచ్చారు. యూజర్లు నచ్చిన భాషలో మాట్లాడడం ద్వారా యూపీఐ సేవలను పొందొచ్చు. దీనికోసం టోన్‌ ట్యాగ్ అనే సంస్థ కొత్త సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో టోన్ ట్యాగ్ సంస్థ దేశంలోని పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులతో కలిసి యూపీఐ 123 పే పేరుతో సేవలను

ప్రారంభించింది. ప్రస్తుతం టోన్‌ట్యాగ్‌ ఫస్ట్ వాయిస్‌ సొల్యూషన్‌తో ఈ సేవలను మరింత విస్తరించనున్నట్లు తెలిపింది.

ఈ కొత్త ఫీచర్‌తో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లో యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. అనంతరం గుజరాతీ, మరాఠీ, పంజాబీలో సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం యూజర్లు 6366 200 200 ఐవీఆర్ నంబర్‌కు కాల్ చేసి వారికి నచ్చిన భాష లేక ప్రాంతీయ భాషను ఎంపిక చేసుకుని ఎంపిక చేసుకుని యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చని వివరించింది. అయితే ఈ సేవలు ప్రస్తుతం కేవలం యుటిలిటీ బిల్లు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్ లేదా రీఛార్జ్ వంటి మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *