బోడిగుండుకు మోకాలికి లంకె పెట్టినట్లు ఆరోగ్య విషయాల్లో ఎలాంటి సంబంధం లేనివి చెబుతుంటారు. ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి.
దీంతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని పలువురు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలే మన గుండె జబ్బులకు మూలమని తెలిసినా ఇటీవల ఓ వార్త హల్ చల్ చేస్తోంది. త్వరగా జుట్టు నెరిసిన, తెల్లబడిన వారికి గుండె జబ్బు సోకే ప్రమాదముందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో జుట్టు నెరిసిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
వృద్ధాప్యంలో జుట్టు నెరవడం కామనే. కానీ వయసులో ఉండగానే తెల్లబడితే చిక్కులే అని సెలవిస్తున్నారు. దీంతో ఏం చేయాలో కూడా అందరికి అర్థం కావడం లేదు. ముసలితనం వచ్చాక జుట్టు తెల్లబడటం సాధారణమే. పురుషులలో గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉండటంతో జుట్టు నెరిసిన వారు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. పలు అధ్యయనాలు కూడా ఇదే విషయం చెబుతుండటంతో జుట్టు తెల్లబడిన వారిలో ఆందోళన నెలకొంటోంది. దీంతో ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
పురుషులలో బట్టతల, చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, ఊబకాయం ఉంటే గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. జుబ్బు హెయిర్ గ్రే అయిన వారికి కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో 42 నుంచి 64 సంవత్సరాల వయసు గల 545 మందిపై పరిశోధనలు జరిపారు. ఇందులోనే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 80 శాతం మందికి బూడిద లేదా తెల్లటి జుట్టు ఎక్కువగా వచ్చిన వారిలో గుండె జబ్బుల ముప్పు ఏర్పడిందని చెబుతున్నారు.
చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం వల్ల ఒత్తిడి, జన్యుశాస్త్రం, థైరాయిడ్ వ్యాధులు, విటమిన బీ12 లోపం, ధూమపానం వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఏర్పడుతుంది. గుండె జబ్బుల ముప్పు తొలగించుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉంటేనే గుండె జబ్బుల ప్రమాదం తొలగిపోతుందని తెలుసుకుంటే మంచిది.
ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి మార్కెట్ లభించి వివిధ రకార ప్రోడక్ట్‌ను వాడుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేక పోతున్నారు. అయితే ఇదే క్రమంలో పలు రకాల సమస్యల బారిన పడుతున్నారు. అయితే అధిక రక్త పోటు కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. బీపీ పెరగడంతో జుట్టు తొందరగా నెరసిపోతుందని నిపుణులు తెలుపున్నారు. అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణాలు మాత్రం ఆధునిక జీవన శైలేనని నిపుపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే తెల్ల జుట్టు.. అధిక రక్త పోటుకు లింక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బీపీ, తెల్ల జుట్టుకు సంబంధం ఏంటీ:అధిక రక్తపోటు అనేక ఇతర వ్యాధులకు కారణం కావొచ్చు. ఈ కారణంగా చిన్న వయస్సులో ఉన్న మహిళల కంటే పురుషులలో తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా వస్తునస్తున్నాయని వైద్యలు తెలుపుతున్నారు.శరీరంలో రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు.. తెల్ల జుట్టు సమస్య రావడం సహజమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా గుండె జబ్బులు తలెత్తే అవకాశాలున్నయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.