అతి తక్కువ ధరకే వివో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంతో తెలుసా

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తాజాగా మార్కెట్ లోకి వివో వై02 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. మొదట ఇండోనేషియాలో ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉండేలా మార్కెట్ లోకి ప్రవేశపెట్టారు.

వివో మొబైల్ ధర జాబితా  వివో మొబైల్ ధర జాబితా ధరలు వివో V21 5G రూ. 29,990 వివో Y20 రూ. 12,990 వివో iQOO 7 లెజెండ్ రూ. 39,990 వివో V21e 5G రూ. 24,990 ..

వివో కొనుగోలు చేయడానికి మంచి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కాదా?

అప్పటి నుండి వివో ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బలమైన ఉనికిని కలిగి ఉంది మరియు దేశంలోని ప్రతి సందు మరియు క్రేనీని కవర్ చేసే కొన్ని బ్రాండ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. వివో సరసమైన ధర ట్యాగ్‌లో గొప్ప అనుభవాన్ని అందించే స్మార్ట్‌ఫోన్‌గా స్థిరపడింది.

మరి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ పాత మోడల్ అయిన వివో వై01 మాదిరిగానే 10 వేల కంటే అతి తక్కువ ధరకే పరిచయం చేసింది వివో సంస్థ. ఈ స్మార్ట్ ఫోన్ మనకు రెండు కలర్లలో లభించనుంది. అందులో ఒకటి ఆర్చిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే కలర్లలో లభించనుంది.

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 95 డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 7,700. అయితే భారత్ లో ఈ ఫోన్ ని ఎప్పుడు లాంచ్ చేయనుంది అన్న విషయాన్ని ఇంకా వివో సంస్థ ప్రకటించలేదు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. వివో వై02 కి 6.51 అంగుళాల హెచ్డి డిస్ప్లే ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే తో లభించనుంది. అలాగే 3జీబీ ర్యామ్,32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ ని మరింత పెంచుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే..వివో వై02 సింగిల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. 8 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరాను ఇచ్చారు.

ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కెమెరాతో సపోర్ట్ చేయనుంది. అలాగే సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్లో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ కూడా ఉంది. బ్యాటరీ స్టోరేజ్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫోన్లో కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్ సపోర్ట్ 4జి డ్యూయల్ బ్యాండ్ వైఫై బ్లూటూత్, మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫ్యూచర్లను కలిగి ఉంది.

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *