మీ పిల్లలు స్మార్ట్‌ ఫోన్స్ కి అడిక్ట్ అయ్యారా? ఇలా చేయండి

స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి.

స్మార్ట్ ఫోన్ లేకపోతే బతకలేము అనే పరిస్థితికి వచ్చారనే చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా ఫోన్ వెంట ఉండాల్సిందే. బెడ్ రూమ్ కే కాదు.. ఆఖరికి బాత్ రూమ్ లోకి కూడా ఫోన్ తీసుకెళ్లిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇప్పుడు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అయితే పెద్దల కంటే పిల్లలకు ఈ స్మార్ట్ అడిక్షన్ ఎక్కువగా ఉంది. పైగా దాని వల్ల ఇబ్బంది పడేవాళ్లలో పిల్లలే ముందుంటారు. కానీ, వారిని ఆ అడిక్షన్ నుంచి ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కావడం లేదా? అయితే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలోకండి.

స్మార్ట్ ఫోన్ వాడకం విషయంలో పెద్దల కంటే పిల్లలో ఎంతో ప్రమాదకరంగా ఉన్నారు. పిల్లలు ఇప్పుడు పుస్తకాలంటే స్మార్ట్ ఫోన్లనే ఎక్కువగా వాడుతున్నారు. కానీ, పేరెంట్స్ వారిని దాని బారి నుంచి కాపాడలేకపోతున్నారు. నిజానికి వారు అలా తయారవ్వడానికి పెద్దలే కారణం అని ఒప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే చిన్నప్పుడు ఏడవకుండా ఉండేందుకు, చెప్పిన మాట వినేందుకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి అలవాటు చేశారు. ఇప్పుడు వారు వాటికి బానిసలుగా మారిపోయారు. కానీ, దానివల్ల ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ అతిగా వాడటం వల్ల శారీరకంగా, మానసికంగా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

స్మార్ట్ ఫోన్ ఎందుకు వాడుతున్నారు?:

పిల్లలు స్మార్ట్ ఫోన్ పట్టుకోగానే.. మీరు కేకలు వేయడం కాదు. అసలు వారు ఎందుకు ఫోన్ వాడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోండి. అంటే టైమ్ పాస్ కి ఫోన్ పట్టుకున్నారా? చదువుకు సంబంధించి ఫోన్ తీసుకున్నారా అనే విషయంపై మీకు అవగాహన ఉండాలి. ప్రస్తుతం అందరూ డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా పిల్లలు తప్పకుండా ఫోన్లు వాడాల్సి వస్తుంది. వారి సమాధాన్ని బట్టి మీరు స్పందించాల్సి ఉంటుంది. మొత్తానికి ఫోన్ దూరం చేయడం కూడా కష్టం, అంతేకాకుండా నష్టం కూడా.

సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పండి:

మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడుతుంటే దానివల్ల వచ్చే అనర్థాలను వారికి తెలిసేలా చేయాలి. ఫోన్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఒబేసిటీ వస్తుంది. కళ్లు దెబ్బతింటాయి. వినికిడి శక్తి తగ్గుముఖం పడుతుంది. నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. ఇలాంటి విషయాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. వారిని కసురుకోవడం కంటే కూడా వారితో ప్రేమగా విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడం అనేది చాలా ముఖ్యం. పసి పిల్లలపై దౌర్జన్యం కంటే ప్రేమగా చెప్పడమే సత్ఫలితాలను ఇస్తుంది.

స్క్రీన్ టైమ్ లిమిట్స్ పెట్టండి:

ఏదైనా ఒక్కసారిగా మానడం అనేది కష్టం. పిల్లలు కూడా ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్ వదిలేయ్ అంటే వదలరు. వాళ్లు రోజూ ఎంతసేపు స్మార్ట్ వాడుతున్నారో మోనిటర్ చేయండి. వారికి స్క్రీన్ టైమ్ సెట్ చేయండి. చిన్నగా ఫోన్ వాడకాన్ని తగ్గిస్తూ రండి. అలా చేస్తే వాళ్లు కూడా స్మార్ట్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

అన్నిచోట్లకి ఫోన్లు అవసరం లేదు:

పిల్లలు ఫోన్ ని ప్రతిచోటుకు తీసుకెళ్లకుండా చూసుకోండి. అంటే బెడ్ రూమ్ లోకి ఫోన్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అంటే పెద్దవాళ్లకు వచ్చినట్లు వారికి ఏమీ ఎమర్జెన్సీ కాల్స్ రావు కాబట్టి.. వారి గదిలోకి ఫోన్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదని చెప్పండి. అంతేకాకుండా బాత్ రూమ్ లోకి కూడా ఫోన్ ను తీసుకెళ్తుంటారు. అక్కడ కూడా మీరు కచ్చితంగా వారిని అడ్డుకోవాలి.

డైవర్ట్ చేయడం ముఖ్యం:

ఫోన్ వాడకం తగ్గించాలి అంటే వారికి వేరే వ్యాపకం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. వారికి ఇష్టమైన ఆట అడుకునేలా చూసుకోండి. ఫోన్ వాడుతుంటే కాసేపు పక్కన పెట్టి అలా నడువు, లేదా మీకు కావాల్సిన వస్తువులు తీసుకురామని చెప్పాలి. వారికి ఏదైనా ఇష్టమైన ఆట ఉంటే వారితో కలిసి మీరు కూడా ఆడటం ఇంకా మంచిది. ఏదేమైనా వారిని ఫోన్ కు దూరంగా ఉండేలా చూసుకోవాలి.

ముందు మీరు మారాలి:

మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడకం మానాలి అంటే ముందు మీరు మానేయాలి. మీరు కూడా అదే పనిగా ఫోన్ కు అతుక్కుపోవడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని చూసి పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. వారిని మానాలని చెప్పినా వాళ్లు మిమ్మల్ని చూసే నేర్చుకున్నాం అంటారు. అందుకే మీరు అవసరం లేకుండా ఫోన్ ని వాడకూడదు. మీరు మానేసి వారిని మానేసేలా చేసుకోవాలి. వారికి మీరే రోల్ మోడల్ కావాలి. ఇలాంటి సింపుల్ టిప్స్‌ ని ఫాలో అయితే మీ పిల్లలు దాదాపుగా స్మార్ట్ ఫోన్ వాడకం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *