ఇలా చేస్తే జుట్టు వద్దన్నా పెరుగుతుంది?

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే అనేక ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నప్పటికీ, మీ జుట్టును చల్లటి నీటితో కడగడం అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతుల్లో ఒకటి. ఈ పద్ధతి వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, చల్లటి నీరు నెత్తికి రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
   జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు అన్నం వార్చగా వచ్చిన గంజిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. అన్నం వార్చగా వచ్చిన గంజిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.
ఈ గంజిని పడేయకుండా పూర్వాకాలంలో ఆహారంగా తీసుకునే వారు. దీనిని తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు కూడా తెలియజేసారు. ఆరోగ్యంతో పాటు జుట్టును సంరక్షించడంలో కూడా ఈ గంజి చాలా బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ గంజిలో ఉండే ఇనోసిటాల్ అనే మూలకం జుట్టు కుదుళ్లను చాలా బలంగా చేసి జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనల్లో నిరూపితమైంది. అన్నం వార్చగా వచ్చిన ఈ గంజిని జుట్టు కుదుళ్ల నఉండి చివరి వరకు దాకా బాగా పట్టించాలి.ఇక తరువాత జుట్టును ముడి వేసుకుని ఆరే దాకా అలాగే ఉండాలి. ఈ గంజి మొత్తం పూర్తిగా ఆరిపోయిన తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది
ఇంకా అలాగే జుట్టు రాలడం, జుట్టు చిట్లడం ఇంకా జుట్టు పొడి బారడం వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అదేవిధంగా గంజిని ఉపయోగించడం వల్ల తల చర్మం పై ఉండే ఇన్ఫెక్షన్ లు కూడా తగ్గి జుట్టు కుదుళ్లు బాగా బలంగా తయారవుతాయి. గంజి జుట్టుకు ఒక మంచి కండిషనర్ గా పని చేసి జుట్టును మృదువుగా ఇంకా అలాగే కాంతివంతంగా మారుస్తుంది. అయితే ఈ గంజి నీరు మరీ పలుచగా ఉంటే దీనిని కొద్ది ఉడికించి చిక్కబడిన తరువాత జుట్టుకు రాసుకోవడం మంచిది.ఇక కేవలం జుట్టును సంరక్షించడంలోనే కాకుండా చర్మాన్ని కాపాడడంలో కూడా గంజి చాలా బాగా ఉపయోగపడుతుంది. గంజిలో పసుపును వేసి మీ ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. తరువాత అది ఆరిన తరువాత నీటితో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు ఇంకా మొటిమలు తగ్గి చర్మం రంగు కూడా బాగా మెరుగుపడుతుంది. ఈ విధంగా గంజి మన ఆరోగ్యాన్ని ఇంకా అందాన్ని కాపాడడంలో బాగా ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం ఖచ్చితంగా చక్కటి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *