తక్కువ ధరకే IRCTC థాయ్‌లాండ్ ట్రిప్.. కపుల్స్‌కైతే ఇది పండగే

తక్కువ ధరకే IRCTC థాయ్‌లాండ్ ట్రిప్.. కపుల్స్‌కైతే ఇది పండగే!

పర్యాటకులను ఆకట్టుకునే IRCTC టూరిజం సంస్థ మరో నూతన ప్యాకేజీతో ముందుకొచ్చింది. అతి తక్కువ ధరలోనే థాయ్‌ల్యాండ్ ట్రిప్‌ను  అందిస్తోంది. దీంతో మీ ప్రియమైనవారితో మీరూ హ్యాపీగా వెళ్లిరావచ్చు.థాయ్‌ల్యాండ్   అందమైన బీచ్‌లకు నిలయం, స్పా మసాజ్‌లు, బౌద్ధ ఆలయాలు, పబ్బులు, నైట్ లైఫ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఈ అందమైన దేశం కుర్రకారుకే కాకుండా నూతన జంటలకు, ప్రేమికులకు కూడా మంచి ఫేవరెట్ డెస్టినేషన్‌గా మారింది. భారత్ నుంచి తక్కువ ఖర్చుతో వెళ్లే అంతర్జాతీయ టూరిస్ట్ కేంద్రంగానూ దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ఇక్కడికి నిత్యం ఎంతో మంది పర్యాటకులు మనం దేశం నుండి వెళ్తారు. ఈ క్రమంలోనే IRCTC సైతం అందుబాటు ధరలోనే తక్కువ బడ్జెట్‌లో మంచి ప్యాకేజీని అందిస్తోంది.

ఈ ప్యాకేజీ నవంబర్ 9 నుండి 14 వరకు ఉంటుంది. ఇందులో బ్యాంకాక్‌ సిటీ టూర్‌తో పాటు పట్టాయాలోని అందమైన బీచ్‌లు ప్రధాన టూరిస్ట్ స్పాట్లను చూపిస్తారు. అయితే, ఈ టూర్ కోల్‌కతా నుండి మొదలవుతుంది.  ఇది తిరిగి కోల్‌కతా చేరుకునేవరకు ఉంటుంది. రానుపోను మొత్తం విమాన ప్రయాణమే. దీంతో మీ  ఫ్యామిలీస్‌తో లేదా మీ సన్నిహితులు, స్నేహితులతో వెళ్లిరావచ్చు.మొత్తం 5 రోజుల ఈ ప్యాకేజీని IRCTC చాలా తక్కువ ధరకే అందిస్తుండటం విశేషం. ఒక్కరు వెళ్లాలనుకుంటే రూ.49,500 ధర చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ఇద్దరు లేదా ముగ్గురు వెళ్లాలనుకునేవారు ఒక్కొక్కరికి రూ.42 వేల ధర నిర్ణయించారు. అలాగే చిన్నపిల్లలుంటే వారికి విత్ బెడ్ రూ.40,200 కాగా.. వితౌట్ బెడ్ రూ.35,400గా వెల్లడించారు. ఈ ప్యాకేజీ ఎంచుకున్నవారు దేశంలో ఎక్కడ నివసిస్తున్నా నవంబర్ 9న సాయంత్రం 6 గంటల కల్లా కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవాలి. అక్కడ ఎయిర్‌పోర్ట్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక రాత్రి 11 గంటలకు విమానం బ్యాంకాక్‌కు బయలుదేరుతుంది. అర్ధరాత్రి అక్కడికి చేరుకున్నాక వీసా ఆన్ అరైవల్ పొందిన తర్వాత మిమ్మల్ని నేరుగా పట్టాయాకు తీసుకెళతారు.

ఉదయం పట్టాయా చేరుకున్నాక ఆరోజు మీకు విశ్రాంతి ఇస్తారు. సాయంత్రం అస్కాజార్ షో చూపిస్తారు. తర్వాత మళ్లీ హోటల్‌కు తీసుకెళ్లి భోజనం అయ్యాక విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయం మిమ్మల్ని స్పీడ్ బోట్‌లో కోరల్ ఐలాండ్స్‌కు తీసుకెళతారు. అక్కడ మీరు అందమైన బీచ్‌లు చూడొచ్చు, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆస్వాదించొచ్చు. అనంతరం మిమ్మల్ని తిరిగి పట్టాయా నగరానికి తరలిస్తారు. రాత్రికి అక్కడే హోటల్‌లో బస చేస్తారు. ఇక మరుసటి రోజు మిమ్మల్ని హోటల్‌ నుంచి చెయించి సఫారీ వరల్డ్‌ను చూపిస్తారు. అనంతరం తిరిగి మిమ్మల్ని బ్యాంకాక్‌కు తీసుకెళతారు. రాత్రికి అక్కడ హోటల్‌లో బసచేసి మరుసటి రోజు బ్యాంకాక్ సిటీ టూర్ చూపిస్తారు. అక్కడ బౌద్ధ ఆలయాలు, మార్కెట్లు సందర్శించవచ్చు. కావాలంటే మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. తిరిగి రాత్రికి మిమ్మల్ని బ్యాంకాక్ విమానాశ్రయంలో వదలేస్తారు. అక్కడి నుండి రాత్రి మళ్లీ భారత్‌కు తిరుగు ప్రయాణం చేస్తారు.ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణ ఛార్జీలు, హోటల్స్ అకామడేషన్, నాలుగు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రివేళలో భోజనాలు. అందులోనే జీఎస్టీ, టూర్ గైడ్ ఫీజు, ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. అయితే, బ్యాంకాక్ వెళ్లాక వీసా ఆన్ అరైవల్ మీరే తీసుకోవాలి. దీంతో పాటు మీ వ్యక్తిగత ఖర్చులు, డ్రైవర్ల టిప్పులు లాంటివి అదనంగా చెల్లించుకోవాలి.ఈ టూర్‌కు వెళ్లాలనుకునేవారు ఈ విషయాలు తప్పకుండా పాటించాలి. ప్రస్తుతం థాయ్‌లాండ్ అంతర్జాతీయ పర్యాటకుల్ని అననుమతిస్తున్నా వాళ్లు కచ్చితంగా రెండు డోసుల కరోనా వాక్సినేషన్ తీసుకొని ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి. మరోవైపు మీ పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ కూడా ఈ ప్రయాణ తేదీలకు 6 నెలల ముందుగానే ఉండాలి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *