విమాన ప్రయాణాల కోసం డిజియాత్ర యాప్.. ఎలా వాడాలంటే..

విమాన ప్రయాణాలను మరింత ఈజీ చేసేందుకు పౌర విమానయాన శాఖ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. అదే డిజియాత్ర. ఫ్లైట్ జర్నీలు చేసేటప్పుడు వెరిఫికేషన్స్ ఇబ్బందులను ఇది తగ్గిస్తుంది.

విమానాల్లో తరచూ ప్రయాణించే వారికి సెక్యూరిటీ చెకింగ్‌, ఇతర ప్రాసెస్‌లు పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుందో అనుభవం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డొమెస్టిక్‌ ఫ్లైట్‌  ప్రయాణం కంటే.. ఎయిర్‌పోర్ట్‌లో పూర్తి చేయాల్సిన ప్రాసెస్‌లకే ఎక్కువ సమయం అవుతుంది. దీంతో స్వదేశీ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం  ఓ గుడ్‌న్యూస్‌ అందించింది. నేడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తోపాటు, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాలు డిజియాత్ర సేవలను లాంచ్‌ చేసింది. దీని ద్వారా దేశీయ ప్రయాణికులు డిజిటల్‌గా చెక్-ఇన్ చేసుకోవచ్చు. ఈ యాప్‌తో పేపర్‌లెస్‌గా ప్రాసెస్‌ పూర్తవుతుంది

ఇదెలా పనిచేస్తుందంటే..

ఎంపిక చేసిన మూడు విమానాశ్రయాలలో డిజిటల్‌ బోర్డింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అదే.. డిజియాత్ర. ఇది పేపర్‌లెస్ వెరిఫికేషన్, అవాంతరాలు లేని ప్రయాణాన్ని అందించేందుకు తీసుకొచ్చిన యాప్. ముందుగా ప్రయాణికులు డిజియాత్ర యాప్‌లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తమ అకౌంట్, ఫేస్ ఐడీని, బయోమెట్రిక్ డేటాను కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇలా వివరాలు సేవ్ చేసుకుంటే ఎయిర్ పోర్ట్ లో చెక్ ఇన్, సెక్యూరిటీ చెక్, ఎయిర్‌క్రాఫ్ట్ బోర్డింగ్ సమయంలో ప్రయాణీకుల వివరాలు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు.

ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, వారణాసిలో విమానాశ్రయాల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చారు. మార్చి 2023 నాటికి హైదరాబాద్, కోల్‌కతా, పూణె విమానాశ్రయాల్లో డిజియాత్ర అందుబాటులోకి రానుంది.

ఫేస్ ఐడీ ఇలా క్రియేట్ చేసుకోవాలి

ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లో డిజియాత్ర ఫౌండేషన్ వెబ్‌సైట్ ద్వారా యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

తర్వాత ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్‌ ఉపయోగించి రిజిస్టర్ అవ్వాలి.

తర్వాత ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేయాలి. సెల్ఫీ ఫోటో తీసుకుని ఫేస్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి.

తర్వాత ప్రయాణించబోయే విమాన వివరాలను ఎంటర్ చేయాలి. బోర్డింగ్ పాస్ డేటాను కూడా అప్‌డేట్ చేయాలి.

ఇలా డిజియాత్ర ఐడీని క్రియేట్ చేసిన తర్వాత, విమానాశ్రయంలోని రిజిస్ట్రేషన్ కియోస్క్‌కి వెళ్లి ఆధార్ వివరాలు ఎంటర్ చేస్తే.. వెరిఫికేషన్ అంతా ఆన్‌లైన్‌లో అయిపోతుంది

 ప్రయాణికులకు డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్‌

దీనికి సంబంధించి భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. భారతదేశంలోని విమాన ప్రయాణికులకు కొత్త డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌ అందించడం లక్ష్యంగా డిజియాత్రను లాంచ్‌ చేసినట్లు పేర్కొంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా బయోమెట్రిక్ ఎనేబుల్డ్ డిజియాత్ర సురక్షితమైన, సౌకర్యవంతమైన ట్రావెల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని తెలిపింది.

 డిజియాత్ర ఎలా పని చేస్తుంది?

డిజియాత్ర సర్వీస్‌ను విమానాశ్రయాలలో బోర్డింగ్ ప్రాసెస్‌ను వేగంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్వహించే లక్ష్యంతో రూపొందించారు. ఈ సర్వీస్‌ను పొందేందుకు, విమాన ప్రయాణికులు డిజియాత్ర యాప్‌లో తమ వివరాలను రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వారు ఆధార్ బేస్డ్‌ వ్యాలిడేషన్‌, సెల్ఫ్‌ ఇమేజ్ క్యాప్చర్‌ని ఉపయోగించడం ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ పూర్తి చేయవచ్చు. ఇది పూర్తయిన తర్వాత.. బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది, ఆ వివరాలు సంబంధిత విమానాశ్రయానికి షేర్‌ అవుతాయి.

ఇ-గేట్ వద్ద ఫైనల్‌ వెరిఫికేషన్‌

ఆ తర్వాత స్టెప్‌ విమానాశ్రయం ఇ-గేట్ వద్ద జరుగుతుంది. ఇ-గేట్ వద్ద, ప్రయాణీకుడు మొదట బార్-కోడెడ్ బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇ-గేట్ వద్ద ఇన్‌స్టాల్ చేసిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ప్రయాణికుడి ఐడెంటిటీ, ట్రావెల్‌ డాక్యుమెంట్‌ని ధృవీకరిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ప్రయాణీకుడు ఇ-గేట్ ద్వారా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *