మీకు ఒంటరిగా ఉండటం ఇష్టమా? ఐతే జాగ్రత్త! ఆయుక్షీణం అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా..

మీకు ఒంటరిగా ఉండటం ఇష్టమా? ఐతే జాగ్రత్త! ఆయుక్షీణం అంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా..

మనసు మర్మం తెలుసుకోవడం అంత సులువు కాదు. సముద్రమంత లోతైన మనసులో ఎన్నో అగాధాలు, మరెన్నో సుడిగుండాలు, మెలితిప్పే సంఘటనలు చెరపలేని అక్షరాల్లా శాశ్వతంగా ముద్రపడిపోతాయి. మనసు మర్మం తెలుసుకోవడం అంత సులువు కాదు. సముద్రమంత లోతైన మనసులో ఎన్నో అగాధాలు, మరెన్నో సుడిగుండాలు, మెలితిప్పే సంఘటనలు చెరపలేని అక్షరాల్లా శాశ్వతంగా ముద్రపడిపోతాయి. ఐతే కొందరు చెరిపేసుకుని ముందుకు వెళ్తారు. మరికొందరు అక్కడే ఆగిపోయి.. కదలలేక.. మెదలలేక వేదన అనుభవిస్తారు. ఫలితంగా ప్రపంచానికి దూరంగా, సమాజానికి ఆవల బ్రతుకీడుస్తుంటారు. ఐతే ఇలా ఒంటరిగా ఎక్కువకాలం గడపడం వల్ల ఆయుష్షు క్షీణిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అవును.. ఒంటరితనం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమట. ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్రమైన సమస్యలను దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. నలుగురితో కలిసి ఉన్నప్పుడు విడుదలయ్యే హార్మోన్లు, భావోధ్వేగాలు ఉల్లాసంగా, ఆనందంగా ఉండేలా ప్రేరేపిస్తాయి. ఒంటరిగా ఉంటే మెదడు చురుగ్గా పనిచేయకపోగా, శరీరానికి అవసరమైన హార్మోన్లు కూడా విడుదలకావని నిపుణులు చెబుతున్నారు.

చుట్టూ మనుషులు ఉండాలని కోరుకోవడం మానవ సహజ లక్షణం. మారుతున్న జీవనశైలి, కుటుంబ వ్యవస్థ, విద్య-ఉపాధి కోసం వలసలు వెళ్లడం వంటి కారణాల వల్ల ఒంటరితనం సమస్య చాలా మందిని పట్టి పీడిస్తోంది. నిజానికి ఒంటరితనం అనేది ఒక్కో వ్యక్తిలో భిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను ఎవరితోనైనా పంచుకోవాలని భావిస్తారు. ఐతే తమ భావాలను పంచుకోవడానికి ఎవరూ లేకపోతే అది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. బిజీ లైఫ్ వల్ల ఒంటరితనం, నిరాశ, ఒత్తిడి పెరిగి ఇతర మానసిక రుగ్మతలకు లోన్లీనెస్‌ మూలకారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే విధంగా ఎక్కువకాలం కొనసాగితే అకాల మరణానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. 65 ఏళ్ల లోపు వయసున్న వారిలో నాలుగింట ఒక వంతు మంది ఒంటరి తనంతో బాధపడుతున్నారని, 40 ఏళ్లు పైబడిన వారిపై నిర్వహించిన పరిశోధన ప్రకారం సోషల్‌ ఐసోలేషన్‌ (సామాజిక ఒంటరితనం) అకాల మరణానికి దారి తీస్తుందని వెల్లడించింది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *