వాట్సప్‌లో కొత్త ఫీచర్… ఇక మీ ఛాట్స్ లీక్ అయ్యే ఛాన్స్ లేదు;
వాట్సప్ యూజర్లకు అలర్ట్. వాట్సప్ కొత్తకొత్త ఫీచర్స్‌ని (WhatsApp Features) అందిస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ప్రైవసీ, సేఫ్టీ కోసం అనేక ఫీచర్స్‌ని రిలీజ్ చేస్తోంది.అయితే డెస్క్‌టాప్ యూజర్స్ విషయానికి వస్తే సేఫ్టీ ఫీచర్స్ తక్కువగానే ఉన్నాయి. డెస్క్‌టాప్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని వాట్సప్ వెబ్‌లో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది మెటా. వాట్సప్ వెబ్, వాట్సప్ డెస్క్‌టాప్ యాప్‌లకు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఫీచర్ రాబోతోంది. అంటే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో వాట్సప్ వెబ్ ఉపయోగించాలంటే పాస్‌వర్డ్ తప్పనిసరి కానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. బీటా వర్షన్ విజయవంతం అయిన తర్వాత యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
వాట్సప్ వెబ్ యూజర్లకు మెటా అందిస్తున్న ఈ ఫీచర్ గురించి WABetaInfo తెలిపింది. స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది. వాట్సప్ యూజర్లు వాట్సప్ వెబ్ లేదా వాట్సప్ డెస్క్‌టాప్ యాప్ ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిందే. అయితే బయోమెట్రిక్ హార్డ్‌వేర్ అన్ని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్‌లో అందుబాటులో ఉండదు కాబట్టి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ అందిస్తోంది మెటా.
వాట్సప్ అందిస్తున్న అదనపు సెక్యూరిటీ ఫీచర్ యూజర్లకు ఎంతగానే ఉపయోగపడనుంది. తమ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో వాట్సప్ లాగిన్ చేశామన్న టెన్షన్ కూడా అవసరం లేదు. పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంటుంది ఎవరూ వాట్సప్‌ని యాక్సెస్ చేయలేరు. ఒకవేళ యూజర్ పాస్‌వర్డ్ మర్చిపోతే లాగౌట్ అయి మళ్లీ లాగిన్ అయితే చాలు.
ఇక వాట్సప్ ఇటీవల మొబైల్ యూజర్లకు అనేక ఫీచర్స్ అందించింది. వాట్సప్ కమ్యూనిటీస్ ఫీచర్ ఇటీవల అందుబాటులోకి వచ్చింది. వేర్వేరు గ్రూప్స్‌ని ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ఉపయోగపడే ఫీచర్ ఇది. ఉదాహరణకు ఓ కంపెనీలో ఉద్యోగులకు డిపార్ట్‌మెంట్ల వారీగా వేర్వేరు గ్రూప్స్ ఉన్నాయనుకుందాం. ఆ గ్రూప్స్ అన్నింటినీ కలిపి ఓ కమ్యూనిటీ క్రియేట్ చేయడానికి వాట్సప్ కమ్యూనిటీస్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ను కాలనీవాసులు, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు ఉపయోగించుకోవచ్చు.
దీంతో పాటు వాట్సప్ గ్రూప్స్‌లో పోల్స్ ఫీచర్‌ని కూడా పరిచయం చేసింది. ఏదైనా ఒక అంశంపై వాట్సప్ గ్రూప్ మెంబర్స్ అభిప్రాయం తెలుసుకోవడానికి, ఓటింగ్ కోరడానికి పోల్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సప్ గ్రూప్స్‌లో ఏకంగా 1024 మెంబర్స్‌ని చేర్చుకునేలా లిమిట్ కూడా పెంచింది. వీడియో కాల్‌లో కూడా ఒకేసారి 32 మంది పార్టిసిపేట్ చేసేందుకు లిమిట్ పెంచింది. ఇవే కాదు, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని వాట్సప్ టెస్ట్ చేస్తోంది