వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలోనే ..ఇక డెస్క్‌టాప్‌లో కూడా!
వాట్సాప్ డెస్క్ టాప్ యాప్‌లో కాల్ హిస్టరీని చూపించే ట్యాబ్ రానుందని తెలుస్తోంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని కొంతమంది బీటా టెస్టర్ల ద్వారా వాట్సాప్ నుంచి కొత్త కాల్స్ ట్యాబ్ యాప్ సైడ్‌బార్‌లో కనిపించింది.
వాట్సాప్ డెస్క్‌టాప్ సైడ్‌బార్‌లో ఉన్న కాల్స్ ట్యాబ్ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ నుంచి యాప్ తాజా బీటా వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. కంపెనీ ఇటీవల ఆండ్రాయిడ్, iOS వినియోగదారులపై ఉన్న వినియోగదారులకు వాట్సాప్ పోల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
అయితే టిప్‌స్టర్ షేర్ చేసిన కాల్స్ ట్యాబ్‌లో లేటెస్ట్ కాల్స్‌ను చూపించడం లేదు.వాట్సాప్ ఇంకా ఈ ఫీచర్‌ను ప్రకటించలేదు. వాట్సాప్ ఇటీవల యాప్‌లో కొత్త ఫీచర్లను విడుదల చేసింది.వాట్సాప్ పోల్స్ గత వారం ఆండ్రియడ్, iOS రెండింటిలోనూ ప్రారంభించారు.
వాట్సాప్‌లో ఇటీవలే మరో సరికొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది ‘ఎల్లో పేజెస్’ తరహా ఫీచర్. ఇది వాట్సాప్‌లో బిజినెస్‌లను కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్. బ్రెజిల్‌తో మొట్టమొదటగా “డైరెక్టరీ” ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్లు వాట్సాప్ శుక్రవారం తెలిపింది, దీని ద్వారా వినియోగదారులు సమీపంలోని స్థానిక చిన్న వ్యాపారాలను బ్రౌజ్ చేయొచ్చు, కనుగొనవచ్చు. డైరెక్టరీని మొదట సావో పాలోలో వాట్సాప్ పరీక్షించింది. పూర్తిగా విజయవంతమైన తర్వాత దీన్ని బ్రెజిల్లో విడుదల చేయబోతున్నారు.
“నవంబర్ 17వ తేదీన బ్రెజిల్లో జరిగిన మొట్టమొదటి వాట్సాప్ బిజినెస్ సమ్మిట్‌లో మార్క్ జుకర్‌బర్గ్ దీనికి సంబంధించిన అప్డేట్ను షేర్ చేశారు. ఈ కొత్త ఫీచర్లు వినియోగదారులకు మెరుగైన ఎండ్-టు-ఎండ్ కామర్స్ అనుభవం అందించడానికి రూపొందించారు. వినియోగదారులను వారికి ఇష్టమైన బ్రాండ్లతో కనెక్ట్ చేస్తుంది.” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
వాట్సప్ సెర్చ్‌ను కూడా ప్రకటించింది, దీని ద్వారా వినియోగదారులు దాని API ద్వారా పెద్ద బ్రాండ్లను కనుగొనగలరు. ఇది బ్రెజిల్, యూకే ఇండోనేషియా, మెక్సికో, కొలంబియా వంటి దేశాల్లో అందుబాటులో ఉంది.
“వ్యక్తులు చాట్ చేయాలనుకుంటున్న బిజినెస్‌ను కనుగొన్న తర్వాత, ఉత్పత్తికి సంబంధించి వారికి ఉన్న ప్రశ్నలను అడగవచ్చు. వారి వస్తువులు, సేవల కేటలాగ్‌ను బ్రౌజ్ చేయవచ్చు. కార్ట్‌లో వస్తువులను యాడ్ చెయ్యవచ్చు. తద్వారా వారు ఏమి కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ నిర్వాహకులకు తెలుస్తుంది.” అని కంపెనీ తెలిపింది.