ప్రతిరోజు నిద్రలేవడం కోసం ఇలా చేస్తున్నారా. అయితే ప్రమాదమే..!
మనలో చాలామంది రాత్రి పడుకునే సమయంలో మూడు నుంచి నాలుగు గంటలపాటు సమయం పడుతుంది ఉదయం మన శరీరం సహజంగా లేవడానికి కూడా ఒక గంట ముందు నుంచి మెదడు మన శరీరాన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది. నేటి ఆధునిక కాలంలో చాలామంది అలారం మీదే ఆధారపడుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్లు అలారం లేకుండానే అనుకున్న సమయానికి లేస్తూ ఉంటారు. ఒకవేళ అలారం పెట్టుకున్నప్పటికీ వాటిని ఆఫ్ చేసి మళ్లీ పడుకుంటారని చెప్పవచ్చు..
అయితే ఇలా తాత్కాలికంగా ఆపి మళ్ళీ నిద్రలోకి వెళ్లడం చాలా మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. దీని ద్వారా చక్రం మధ్యల మెదడుకు అంతరాయం కలిగిస్తుందట. ప్రతిరోజు ఇలా చేయడం ద్వారా మెదడుకు చాలా హానికరం గా మారుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. అలా నిద్ర లేచిన వారి మెదడు చురుగ్గా పనిచేయదని కూడా తెలియజేశారు. అంతేకాకుండా కొంతమందికి భయం ఆందోళన, కోపం, ఒత్తిడి ,చిరాకు ఇతర సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా అలారంపై ఆధారపడిన వారు ఒకే అలారంతో లేవడం చాలా కష్టంగానే ఉంటుందని చెప్పవచ్చు. అందుచేతనే ఎవరైనా అలారం పెట్టుకుని లేచేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.