ఏదైనా సరే.. ఎక్కువైనా, తక్కువైనా అనర్థాలే కలుగుతాయి. నిద్ర విషయంలోనూ అంతే.. నిద్రలేమితో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడితే.. అతినిద్ర కూడా అనర్థమేనంటున్నారు పరిశోధకులు. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల ఎన్నో అనారోగ్యసమస్యలు చుట్టుముడుతున్నాయి
ఎక్కువ సమయం, తక్కువ సమయం నిద్రపోతున్నట్లయితే రోగ నిరోధక శక్తి చాలా వేగంగా బలహీనపడుతుంది. ఇతర వ్యాధులు వ్యాపిస్తాయి. సమస్య ఎక్కువైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.సరిపడా నిద్ర లేకపోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనకారులు తెలిపారు. వీటితో పాటు ఇతర వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకే నిర్ణీత సమయం నిద్రపోవడం ద్వారా శరీరాన్ని పిట్గా ఉంచుకోవచ్చునని వైద్యులు సలహా ఇస్తున్నారు.సాధారణ గంటలు నిద్రపోతున్న వారికంటే.. వీరు 20 శాతం ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారని ఓ పరిశోధనలో తేలింది.
నిద్రలేమి కారణంగా వచ్చే 13 వ్యాధుల జాబితాను రూపొందించారు పరిశోధకులు. ఈ మూడు వయసుల వారిలోనూ 5 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోవడం వల్ల మల్టిమోర్బిడిటీ ప్రమాదం 30 నుండి 40 శాతం పెరిగిందని పరిశోధకులు తేల్చారు.ఆరోగ్యవంతమైన జీవితానికి 7 గంటల నుంచి 8 గంటల పాటు నిద్ర అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు. ఏదైనా పనిలో నిమగ్నమైపోయినా.. ఒకటి లేదా రెండు రోజులు తక్కువ నిద్రపోయినా, మరుసటి రోజు తగినంత నిద్రపోవడం ద్వారా దాన్ని భర్తీ చేసుకోవచ్చు. కానీ, ప్రతి రోజూ ఇలాగే సరిపడా నిద్ర పోకపోతే