మీకు ఓటు హక్కు ఉందా? మీ ఓటర్ ఐడీ కార్డ్ ఇంట్లో ఎక్కడ దాచారో గుర్తులేదా?
మీరు ఒక్క నిమిషంలో మీ ఇ-ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెండేళ్ల క్రితమే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది. అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డిజిటల్ కాపీ డౌన్‌లోడ్ చేసినట్టు ఇ-ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసి మీ స్మార్ట్‌ఫోన్‌లో దాచుకోవచ్చు. భారతదేశంలో ప్రస్తుతం 9.8 కోట్ల మంది ఓటర్లకు ఇ-ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉన్నా, 1 శాతం మంది ఓటర్లు మాత్రమే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకున్నట్టు ది హిందూ కథనం పబ్లిష్ చేసింది.
డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ పీడీఎఫ్ ఫైల్ రూపంలో ఉంటుంది. దీన్నే ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడీ కార్డ్ అని పిలుస్తారు. ఎన్నికల కమిషన్ అధికారిక పోర్టల్‌లో సులువుగా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ చూపించి ఓటు కూడా వేయొచ్చు. ఓటర్లు తమ ఓటర్ ఐడీ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసిన డిజిటల్ ఓటర్ కార్డును ప్రింట్ తీసుకొని ల్యామినేట్ కూడా చేయొచ్చు. డిజీలాకర్ యాప్ ఉపయోగిస్తున్నవారు ఈ యాప్‌లో ఇ-ఓటర్ ఐడీ కార్డ్ అప్‌లోడ్ చేయొచ్చు.
ఓటర్లు హెచ్టిటిపిఏస్ ://వోటర్పోర్టల్ .ఈసిఐ .గొవ్ .ఇన్ / వెబ్‌సైట్ లేదా నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ .ఎన్విఎస్పి .ఇన్ / లేదా ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు. తమ వివరాలతో లాగిన్ అయిన తర్వాత ఓటర్ ఐడీ కార్డ్ నెంబర్‌తో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఎలాగో ఈ కింది స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.
స్టెప్ 1- ముందుగాడబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ .ఎన్విఎస్పి .ఇన్ / లేదా హెచ్టిటిపిఏస్ ://వోటర్పోర్టల్ .ఈసిఐ .గొవ్ .ఇన్/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
స్టెప్ 2- గతంలో రిజిస్టర్ చేసుకున్నట్టైతే ఆ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలి.
స్టెప్ 3- లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో ఏ-ఎపిక్ డౌన్లోడ్పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 4- ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి.
స్టెప్ 5- ఆ తర్వాత సెండ్ ఓటీపీపైన క్లిక్ చేయాలి.
స్టెప్ 6- ఆ ఓటర్ ఐడీ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ వస్తుంది.
స్టెప్ 7- ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది.
స్టెప్ 8- ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ ఏ-ఎపిక్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 9- పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.
కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నవారు, ఓటర్ ఐడీ లేకపోతే ఫామ్ 6 రిఫరెన్స్ నెంబర్‌తో ఏ-ఎపిక్డౌన్‌లోడ్ చేయొచ్చు. డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలంటే నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. ఓటర్ ఐడీకి మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసి ఉండాలి.