అమ్మాయిలు ఆన్‌లైన్‌లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి

టెక్నాలజీ అనేది దినచర్యలో భాగం అయిపోయింది. ఇంటర్నెట్‌ ఎంతోమంది జీవితాలను మార్చేసింది. సోషల్‌ మీడియా ద్వారా మహిళల వాణి విశ్వవ్యాప్తంగా వినిపిస్తున్నది.
ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇదంతా నాణానికి ఒకవైపే. నెట్‌ వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలున్నా .. అంతకు రెట్టింపు మోసాలూ జరుగుతున్నాయి.వుమన్ సేఫ్టీ :- టెక్నాలజీ అనేది దినచర్యలో భాగం అయిపోయింది. ఇంటర్నెట్‌ ఎంతోమంది జీవితాలను మార్చేసింది. సోషల్‌ మీడియా ద్వారా మహిళల వాణి విశ్వవ్యాప్తంగా వినిపిస్తున్నది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇదంతా నాణానికి ఒకవైపే. నెట్‌ వాడకం వల్ల ఎన్ని ఉపయోగాలున్నా .. అంతకు రెట్టింపు మోసాలూ జరుగుతున్నాయి.

ఈ అనంత డిజిటల్‌ ప్రపంచంలో.. మోసపోతున్నదీ, దోపిడికి గురవుతున్నదీ, బలవుతున్నదీ ఎక్కువగా మహిళలే. సైబర్‌ స్టాకింగ్‌, సైబర్‌ దోపిడి, సైబర్‌ బెదిరింపు, సైబర్‌సెక్స్‌ ట్రాఫికింగ్‌, ఫిషింగ్‌ వంటి వాటితో మహిళలు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇదొక విషవలయం. అందుకే మహిళలు క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇదే సరైన సమయం. ఆన్‌లైన్‌ మోసాలు, నేరాలు, వేధింపులపై అవగాహన పెంచుకోండి. జాగరూకతతో వ్యవహరించండి. లేకపోతే, జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

మహిళలు ఎదుర్కొనే నేరాలు..

1. రివెంజ్‌ పోర్న్‌ : సమ్మతితో తీసిన లైంగిక, అసభ్యకర ఫొటోలు, వీడియోలను.. సంబంధిత వ్యక్తి అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో పోస్టు చేయడం. ఈ కేసుల్లో ఎక్కువగా మహిళలే బలవుతున్నారు. ఏకాంతంలో.. సదరు వ్యక్తిపై నమ్మకంతో ఇలాంటి చర్యలకు అనుమతి ఇవ్వడమే దీనికి కారణం. ఇవి ఎప్పటికైనా ముప్పు తెస్తాయి. ఈరోజు సఖ్యతగా ఉన్నవారు.. రేపు శత్రువు కావొచ్చు. ఈ కేసుల్లో ఎక్కువగా మాజీ ప్రియులు బెదిరింపులకు పాల్పడుతుంటారు. మానసికంగా ఇబ్బంది పెడుతూ.. డబ్బు వసూలు చేస్తూ.. నిరంతర క్షోభకు గురిచేస్తుంటారు.

2. ఆన్‌లైన్‌ వంచన :పెండ్లి

పేరుతో, స్నేహం పేరుతో సోషల్‌ మీడియాలో పరిచయం చేసుకుంటారు. అందుకు నకిలీ ఖాతాలు సృష్టిస్తారు. ఖరీదైన బహుమతులు పంపి బుట్టలో వేసుకుంటారు. ఆ తర్వాత తను ఇబ్బందుల్లో ఉన్నానని, స్వదేశం రాగానే పెండ్లి చేసుకుంటానని/డబ్బులు తిరిగిస్తానని నమ్మించి అన్నివిధాలుగా లూటీ చేస్తారు.

3. సెక్స్‌ ట్రాక్షన్‌ : సైబర్‌ దోపిడికి ఇదొక వికృత రూపం.. అమ్మాయిలు సోషల్‌ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్‌ చేసే ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసి, లైంగికంగా వేధించడం.. అదును చూసి డబ్బు డిమాండ్‌ చేయడం.. అవకాశం వస్తే అనుభవించడం. అడిగింది ఇవ్వకపోతే.. కుటుంబసభ్యులు, సన్నిహితులకు పంపుతామని, పోర్న్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేస్తామని తీవ్రంగా బెదిరించడం.

సైబర్‌ స్టాకింగ్‌ : మహిళలువాడే ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించి.. వారికి తెలియకుండానే మాల్‌వేర్‌ సాయంతో ట్రాక్‌ చేయడం. అర్థంలేని ఫోన్‌ కాల్స్‌తో విసిగించడం, అసభ్యకర సందేశాలు పంపడం, సోషల్‌ మీడియాను రహస్యంగా పర్యవేక్షించడం, వారి ఖాతాల సమాచారాన్ని సేకరించి.. బెదిరించడం.

5. డాక్సింగ్‌ : ఇది ఓ వ్యక్తి లేదా అతని సంస్థ వ్యక్తిగత సమాచారం రహస్యంగా తీసుకొని, బహిర్గతం చేస్తామని బెదిరించడం. మోసగాళ్లు ఎక్కువగా పబ్లిక్‌ డొమైన్‌లోని సమాచారాన్ని సేకరించి ఆన్‌లైన్‌ షేమింగ్‌, దోపిడికి పాల్పడుతుంటారు. ఇలా ఎన్నో రకాలుగా మహిళలను నిలువునా మోసం చేస్తున్నారు. ఒకరిచేతిలో మోస పోవడం అనేది.. ఒక రకంగా మన వైఫల్యమే.
› థర్డ్‌పార్టీ యాప్స్‌తో జాగ్రత్తగా వ్యవహరించండి. వాటివల్లే అనర్థాలు.
› మీ వెబ్‌క్యామ్‌ను ఎప్పుడూ ఆఫ్‌ చేసి ఉంచండి. పాస్‌వర్డ్‌ను స్ట్రాంగ్‌గా సెట్‌ చేయండి.
› సైబర్‌ నేరానికి గురై ఉంటే.. ఆ నేరానికి సంబంధించిన అన్ని స్క్రీన్‌ షాట్‌లను తీసుకోండి. సంబంధిత సోషల్‌ మీడియా పోర్టల్స్‌లో రిపోర్ట్‌ చేయండి.
› సైబర్‌ నేరాల బాధితులైతేహెట్ప్స్://సైబర్క్రైమ్/.గొవ్.ఇన్ /లో ఫిర్యాదును చేయండి. సహాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కి డయల్‌ చేయండి.

 

 

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *