ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 25 పాయింట్ల లాస్. వివరాలు;

ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 25 పాయింట్ల లాస్. వివరాలు;

దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 12 పాయింట్ల లాభంతో 60, 759 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 18,075 వద్ద ట్రేడ్​ అవుతోంది.

దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను భారీ లాభాలతో ముగించాయి.అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు ఇందుకు కారణం. బీఎస్​ఈ సెన్సెక్స్​ 847 పాయింట్లు పెరిగి 60,747 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.242 పాయింట్ల లాభంతో 18,101 వద్ద ముగిసింది. బీఎస్​ఈ మిడ్​క్యాప్​ సూచీ 0.93శాతం, స్మాల్​ క్యాప్​ సూచీ 0.56శాతం పెరిగాయి. ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 60805- 18121 వద్ద మొదలుపెట్టాయి.

పివోట్​ ఛార్ట్ ప్రకారం నిఫ్టీ సపోర్ట్​ 17,981- 17,933- 17,854 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18,138- 18,186- 18,265 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై;

మ్యాక్స్​ ఫినాన్షియల్ సర్వీసెస్​ లిమిటెడ్​ (ఎంఎఫ్​ఎస్​ఎల్​):– బై రూ. 740, స్టాప్​ లాస్​ రూ. 720, టార్గెట్​ రూ. 775

పాలీక్యాబ్​:- బై రూ. 2653, స్టాప్​ లాస్​ రూ. 2620, టార్గెట్​ రూ. 2720

హెచ్​సీఎల్​ టెక్​:– బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1040, టార్గెట్​ రూ. 1080- రూ. 1090

మహీంద్రా అండ్​ మహీంద్రా (ఎం అండ్​ ఎం):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1270, టార్గెట్​ రూ. 1350- రూ. 1370

లాభాలు,నష్టాలు;

టాటా మోటార్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఎయిర్​టెల్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టీసీఎస్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హెచ్​డీడీఎఫ్సీ.  ​సన్ ఫార్మా, హెచ్​యూఎల్ ​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు;

అమెరికా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.34శాతం నష్టపోగా  ఎస్​ అండ్​ పీ 500 0.08శాతం పతనమైంది.నాస్​డాక్​ మాత్రం 0.63శాతం లాభపడింది.

ఆసియా మార్కెట్​లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్​ నిక్కీ 0.8శాతం లాభాల్లో ఉండగా,ఎస్​ అండ్​ పీ 200 0.2శాతం నష్టాల్లో ఉంది.

త్రైమాసిక ఫలితాలు;

అథర్వ్​ ఎంటర్​ప్రైజెస్  ఎక్సెల్ ​ రియాల్టీ ఎన్​ ఇన్​ఫ్రా, గాలా గ్లోబల్​ ప్రాడక్ట్స్​, జీఐ ఇంజినీరింగ్​ సొల్యూషన్స్​, మార్సన్స్​, క్వెస్ట్​ క్యాపిటల్​ మార్కెట్స్​తో పాటు ఇతర సంస్థల క్యూ3 త్రైమాసిక ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి.

ఎఫ్​ఐఐలు, డీఐఐలు;

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 203.13కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1723.79కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *