నవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. నవ్వడం ఒత్తిడి తగ్గుతుంది, మనసు ఉల్లాసంగా మారుతుందని నిపుణులు సైతం చెబుతుంటారు. అందుకే నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే సామెత ఉంది.
అటు నవ్వు..ఇటు ఏడుపు రెండూ భావోద్వేగానికి సంబంధించినవే. అందుకే అమితమైన ఆనందం కలిగినా లేదా బాధ కలిగినా కళ్ల నుంచి నీళ్లు ఉబికి వస్తుంటాయి. నవ్వు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని అందరికీ తెలుసు. అదే సమయంలో ఏడుపు కూడా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు. కేవలం నవ్వడం వల్లనే కాదు..ఏడ్వడం వల్ల కూడా లాభాలున్నాయిట. అవేంటో తెలుసుకుందాం..
అయితే నవ్వక పోవడం రోగమే కానీ.. ఏడ్వడం మాత్రం రోగం కాదని చెబుతున్నారు నిపుణులు. నిజం నవ్వడం ఎలా అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఏడ్వడం వల్ల కూడా అలాంటి లాభాలే ఉంటాయని చెబుతున్నారు. ఇంతకీ ఏడ్వడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలంటే ఓ లుక్కేయండి..
కన్నీళ్ల కారణంగా చెడు ఆలోచనలు దూరమవడమే కాకుండా మానసిక ప్రశాంతత కలిగి పాజిటివ్ ఆలోచనలవైపు దృష్టి మరలుతుంది. మూడు రకాల కన్నీళ్లు కూడా మేలు కల్గిస్తాయి
ఎక్కువగా ఏడ్వటం ద్వారా కంటికి కూడా చాలా ప్రయోజనాలున్నాయి. కళ్లల్లో ఉండే దుమ్ము, మలినాలు బయటకు పోతాయి. కన్నీటిలో ఉండే ఐసోజైమ్స్..క్రిములు, బ్యాక్టీరియా నుంచి కంటికి రక్షణ కల్పిస్తాయి.
ఏడ్వడం వల్ల మెదడు, శరీర ఉష్ణోగ్రతలు సంతులితంగా ఉండి..సమన్వయంతో ఆలోచించగలుగుతాం. అప్పుడప్పుడూ ఏడ్వడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు దరి చేరవు.
ఏదైనా విషయం గురించి బాధపడుతూ ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్పిన్ అనే ఫీల్‌గుడ్ రసాయనాలు విడుదలై శారీరక, మానసిక భావోద్వేగాలకు సంబంధించిన మార్పులు కలుగుతాయి. ఫలితంగా శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది.
* ఏడుపు మన శీరంలోని హానికరమైన పదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బాధ పడడం కంటే కన్నీరు వచ్చేలా ఏడ్వడం వల్లే ఎక్కువ ప్రయోజం ఉంటుందంటా. కన్నీరులో 98 శాతం నీరు, మిగిలనవి హార్మోన్లు, టాక్సిన్స్ ఉంటాయి. కన్నీటి ద్వారా శరీరం నుండి అనేక విష పదార్థాలు విడుదలవుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
* ఏడ్వడం వల్ల మనసు తేలిక పడుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. బాధతో భారంగా మారిన మనసు ఏడిస్తే తేలికగా మారుతుందని మానసిక నిపుణుల అభిప్రాయం. చాలా మంది మనస్ఫూర్తిగా ఏడ్చిన తర్వాత కొత్త ఉత్సాహాన్ని పొందుతారని చెబుతున్నారు.
* అప్పుడప్పుడు ఏడ్వడం వల్ల కళ్లు పొరిబారడం అనే సమస్యను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డ్రై ఐ లేదా డ్రై ఐ గ్లాండ్స్తో బాధపడేరికి ఏడుపు మంచి ఔధంగా చెబుతున్నారు.
* కొన్ని పరిశోధనల ప్రకారం బరువు తగ్గడంలో వ్యాయామం, డైట్‌తో పాటు ఏడుపు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందంటా. ఏడిచే సమయంలో శరీరంలో అధిక క్యాలరీలు ఖర్చు కావడం వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు.
* ఏడుపు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనసులో అనవసరగా బాధలు పెట్టుకొని కుంగిపోయే కంటే మనసారా ఏడ్చేసి తృప్తిగా ఉండాలని సూచిస్తున్నారు.
సాంకేతికత అభివృద్ది చెందే కొద్దీ అంతేవేగంగా అందిపుచ్చుకునేందుకు మనిషి ప్రయత్నాలు తీవ్రంగా ఉన్నాయి. ఫలితంగా నిత్య జీవితంలో చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో మనిషి ఆరోగ్యం కోసం నవ్వు ఎంత ముఖ్యమో..ఏడుపు కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు.