టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, సెక్యూరిటీపరంగా ఎన్ని ఫీచర్లు వచ్చినా హ్యాకర్లు సైబర్ అటాక్ చేస్తూనే ఉంటారు. వాటి నుంచి తప్పించుకోవాలంటే యూజర్లు ఫోన్ లో ఇంటర్నెట్ వాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.
తెలియని వెబ్ సైట్స్ లింక్స్, థర్డ్ పార్టీ యాప్స్, గూగుల్ యాడ్స్ ఓపెన్ చేయకుండా చూసుకోవాలని మైక్రోసాఫ్ట్ చెప్తోంది. ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ అలర్ట్, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ సెక్యూరిటీ అప్ డేట్ విడుదల చేసింది.
ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్, డెస్క్ టాప్‌పై కనిపించే యాడ్స్ అన్నీ నిజమైనవి కావు. వాటిని పొరపాటున తెరిచినా.. ఫోన్ లోకి వైరస్, మాల్వేర్, ర్యాన్సమ్ వేర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వాటిని ఉపయోగించి హ్యాకర్లు సైబర్ అటాక్ చేయొచ్చు. ఒక్కసారి మాల్వేర్ ఫోన్ లోకి వస్తే, మీ ఫోన్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్, కాంటాక్ట్స్ వేరే ఇతర డేటా అంతా హ్యాకర్ల చేతికి చేరే ప్రమాదం ఉంటుంది. ఫేక్ యాడ్స్ ఎక్కువగా థర్డ్ పార్టీ యాప్స్, వెబ్ సైట్స్ వాడేటప్పుడు వస్తాయి. అందుకే అలాంటి సైట్లని తెరవకూడదు. ఫేక్ యాడ్ అని అనుమానం వస్తే గూగుల్ కు రిపోర్ట్ చేయాలి