దేశంలోని యువతకు వివిధ రంగాల్లో స్కిల్స్పెపొందించడానికి అవసరమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తుంది నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ .
తాజాగా డ్రోన్ డెస్టినేషన్ సంస్థ సహకారంతో దేశవ్యాప్తంగా 10 డ్రోన్ హబ్స్‌ను ఏర్పాటు చేయనుంది ఈ సంస్థ. ఈ హబ్స్ ద్వారా రిమోట్ పైలట్ సర్టిఫికేషన్‌కు అవసరమైన ట్రైనింగ్ అందించనుంది. అలాగే సర్వే అండ్ మ్యాపింగ్, అసెట్స్ ఇన్సెక్షన్, సర్వైలెన్స్ అండ్ మానిటరింగ్, సినిమాటోగ్రఫీ వంటి వాటిపై అనేక రకాల అప్లికేషన్ బేస్డ్ ట్రైనింగ్ కూడా అందించనున్నట్లు ఎన్స్డిసి వెల్లడించింది.
ఉద్యోగాలు .. రాత పరీక్ష లేకుండానే ఎంపిక”>
డ్రోన్ హబ్స్ ద్వారా రాబోయే ఐదేళ్లలో డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మానవరహిత వైమానిక వాహనాలను మెయింంటెన్ చేయనున్నారు. రెంట్-ఏ-డ్రోన్- విత్- పైలట్ వంటి సేవలను క్విక్‌గా
ఉద్యోగాలు .. రాత పరీక్ష లేకుండానే ఎంపిక”>
డ్రోన్ హబ్స్ ద్వారా రాబోయే ఐదేళ్లలో డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మానవరహిత వైమానిక వాహనాలను మెయింంటెన్ చేయనున్నారు. రెంట్-ఏ-డ్రోన్- విత్- పైలట్ వంటి సేవలను క్విక్‌గా, సమర్థవంతంగా దేశంలోని ప్రతి తహసీల్‌కు 6 నుంచి 8 గంటలలోపు అందించడానికి డ్రోన్ హబ్స్ ఏర్పాటు చేయనున్నారు. డ్రోన్ డెస్టినేషన్‌లో శిక్షణ పొందేందుకు ఔత్సాహిక పైలట్‌ల కోసం ఎన్ఎస్‌డీసీ లోన్ సౌకర్యం కల్పిస్తుంది. అనుబంధ NBFCల ద్వారా ఈ ఫెసిలిటీని అందించనుంది. తద్వారా అభ్యర్థులు హై-క్వాలిటీ స్కిల్స్ పెంపొందించుకోనున్నారు.
యువతకు రెట్టింపు లబ్ధి..
NSDCతో తమ భాగస్వామ్యం యువతకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు డ్రోన్ డెస్టినేషన్ సీఈవో చిరాగ్ శర్మ. దేశంలో అందుబాటులో ఉన్న సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా డ్రోన్ ట్రైనింగ్‌పై దృష్టి పెడితే అభ్యర్థులు కెరీర్లో ముందుకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రధాని మోదీనరేంద్ర మోదీ విజన్ అయిన ‘హర్ హాత్ మే స్మార్ట్ ఫోన్, హర్ ఖేత్ మే డ్రోన్, హర్ ఘర్ సమ్రాధి’ ద్వారా భారత వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుందని వివరించారు.
‘త్వరలోనే దేశవ్యాప్తంగా మరిన్ని డ్రోన్ హబ్‌లు అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త సన్‌రైజ్ సెక్టార్‌లో నైపుణ్యాభివృద్ధి కోసం ఔత్సాహిక పైలట్‌లు లోన్స్ పొందే అవకాశం ఉంది. డ్రోన్ రెవల్యూషన్‌లో భాగం కావాలనుకునే వారికి ఈ ఫెసిలిటీ సాయం చేస్తుంది. వ్యవసాయంలో దిగుబడిని పెంచడం, దేశంతో పాటు ప్రపంచ ఆహార అవసరాలను తీర్చడానికి భారతదేశంలోని వ్యవసాయ క్షేత్రాల్లో లక్షలాది మంది డ్రోన్ పైలట్ల అవసరం ఉంది. వారిని వ్యవసాయం వైపు కచ్చితంగా మళ్లిస్తాం. దీంతో వ్యవసాయ ఆదాయం పెరుగుతుంది. తద్వారా యువత ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు.’ అని శర్మ పేర్కొన్నారు.
మూడు లక్షల మంది డ్రోన్ పైలట్ల అవసరం..
వచ్చే ఐదేళ్ల వ్యవధిలో దేశానికి మూడు లక్షల మంది డ్రోన్ పైలట్లు అవసరమని తెలిపారు NSDC అధికారి వేద్ మణి తివారీ. ఈ డిమాండ్‌కు తగ్గట్టు సప్లై పెంచడానికి, అలాగే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పన కోసం అవసరమైన నైపుణ్య మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు డ్రోన్ డెస్టినేషన్ సంస్థకు సహాయ సహకారాలు అందించడానికి భాగస్వామిగా NSDC కట్టుబడి ఉందన్నారు.