మార్కెట్లో స్థిరంగా బంగారం ధర.. తులం ఎంతంటే?

బంగారం ధర తగ్గింది అంటే ముందు గా సంతోషించే వాళ్ళు ఎవరైనా వున్నారు అంటే ఆడవాళ్లు మాత్రమే..

బంగారం మాత్రమే అంతర్జాతీయ కరెన్సీని తగ్గించలేనిది కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దానిని విలువైన నిల్వగా ఉంచుతారు. ఇది దీర్ఘకాలంలో బంగారాన్ని అత్యంత స్థిరమైన కరెన్సీగా చేస్తుంది. 1930ల నుండి, U.S. డాలర్ బంగారం నుండి నెమ్మదిగా విడదీయబడినప్పుడు, డాలర్ బంగారంపై దాని విలువలో 99% కోల్పోయింది.

బంగారం ద్రవ్యోల్బణం మరియు కరెన్సీ విలువ తగ్గింపుకు వ్యతిరేకంగా రక్షణగా ఉంచబడుతుంది. కరెన్సీ మారవచ్చు కానీ బంగారం ధర చాలా కాలం పాటు స్థిరంగా ఉంటుంది. కరెన్సీ విలువ తగ్గుతుందని పెట్టుబడిదారులు భయపడినప్పుడు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. డాలర్ బలహీనపడినప్పుడు, బంగారం బలపడుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. స్వల్పంగా హెచ్చుతగ్గులు మినహా, బంగారం ధర దాదాపుగా స్థిరంగానే వుంది. ఒక ఈ నెల ప్రారంభ తేదీ నుండి బంగారం ధర పరిశీలిస్తే, సెప్టెంబర్ 1 న 50,730 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్, ఈరోజు 51,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.

అంటే, చాలా స్వల్పమైన మార్పును మాత్రమే చవిచూసింది. అయితే, ఈ మధ్యలో హెచ్చు తగ్గులను నమోదు చేసింది. మరి ఈరోజు దేశవాప్తంగా బంగారం ధర ఎలా కొనసాగుతుందో పరిశీలిద్దాం.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,650 రూపాయలుగా ఉండగా, ఈరోజు 100 రూపాయలు పెరిగి 46,750 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,000 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,010 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,650 గా ఉంది.

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *