టైప్ చెయ్యకుండానే వాట్సాప్ నుండి మెసేజ్ పంపండి.. ఎలాగంటే!

ప్రపంచవ్యాప్తంగా అధిక ప్రచుర్యాన్ని చోరగొన్న చాటింగ్ యాప్ వాట్సాప్ లో మీకు తెలియని చాలా ట్రిక్స్ దాగున్నాయి. వాటిలో అన్ని అందరికి తెలియక పోవచ్చు.

ఈరోజు మనం అటువంటి ఒక చిన్న ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. ఈ ట్రిక్స్ కొందరికి తెలిస్తే, మరికొందరికి తెలియకపోవచ్చు. అదేమిటంటే, టైప్ చెయ్యకుండానే వాట్సాప్ నుండి మెసేజ్ ను సెండ్ చెయ్యవచ్చు. అంటే, మీరు మీ వాట్సాప్ నుండి టైప్ చెయ్యకుండానే చాటింగ్ లేదా మెసేజ్ పంపవచ్చు. దీనికోసం ఈ చిన్న ట్రిక్ తెలుసుకుంటే సరిపోతుంది…

ఇప్పటికే మీరు మీ వాట్సాప్ ల ఈ ఫీచర్ ను ఉపయోగిస్తుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు కనుక ఈ ఫీచర్ ను మీ ఫోన్ లో మీ వాట్సాప్ తో ఎలా ఉపయోగించాలో తెలియక పొతే, ఇక్కడ నుండి ఈజీగా తెలుసుకోవచ్చు మరియు మీరు కూడా మీ వాట్సాప్ మెసేజిలను టైప్ చెయ్యకుండానే పంపించవచ్చు. మరి ట్రిక్ ఎలా చెయ్యాలో చూద్దామా.

ముందుగా, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ మరియు iOS ఫోన్లలో సిరి సహాయంతో మెసేజింగ్ యాప్ ఒపెన్ చెయ్యకుండానే మెసేజిలను పంపించవచ్చు. అలాగే, మెసేజింగ్ యాప్ తెరవకుండానే మెసేజిలను చదివే అవకాశం వుంది. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఫీచర్ ను వాట్సాప్ కూడా తీసుకొచ్చింది.

మీ వాట్సాప్ లో ఈ ఫీచర్ ను యాక్టివేట్ చెయ్యాలనుకుంటే గూగుల్ యస్ మరియు వాట్సాప్ నోటిఫికేషన్ యాలకు యాక్సెస్ ఇవ్వాల్సివుంటుంది. ఒకవేళ మీకు ఈ ఫీచర్ అవసరం లేదనుకుంటే సెట్టింగ్ లోకి వెళ్లి ఎప్పుడైనా యాక్సెస్ ను నిలిపి వేయవచ్చు. మీ ఫోన్లో ఈ ఫీచర్ ను యాక్టివేట్ చెయ్యాలనుకుంటే ఈ క్రింద విధంగా చేయండి.

వాయిస్ కమాండ్‌ని ఉపయోగించి వాట్సాప్లో సందేశం పంపడానికి మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్అసిస్టెంట్ ఫీచర్‌ని ఉపయోగించాలి.

మీ ఫోన్‌లో గూగుల్ యాప్‌ని తెరిచి, ఎగువ కుడి వైపున ఉన్న మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి
మీ ఆండ్రాయిడ్ఫోన్‌లో సెట్టింగ్‌లకు వెళ్లి, గూగుల్ అసిస్టెంట్ను తెరవండి

వాట్సాప్లో ఏదైనా పరిచయానికి సందేశం పంపడానికి మీ ఫోన్ మైక్రోఫోన్‌కు దగ్గరగా మాట్లాడండి
ఉదాహరణకు, మీరు చెప్పవచ్చు, స్నేహితుడికి వాట్సాప్సందేశాన్ని పంపండి మరియు గూగుల్అసిస్టెంట్ పరిచయాన్ని శోధించి మీకు ఫలితాలను అందిస్తుంది
ఇప్పుడు అసిస్టెంట్ మిమ్మల్ని వాట్సాప్ లో సందేశం పంపమని అడుగుతుంది, కాంటాక్ట్ కోసం సందేశాన్ని నిర్ధారించడానికి, సరే, పంపండి అని చెప్పి ప్రతిస్పందిస్తారు.

  • మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో టైప్ చేయకుండానే మీ వాట్సాప్ సందేశం పంపబడుతుంది.

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *