సరికొత్త నాయిస్ఇయర్‌బడ్స్‌ లాంచ్‌.. హెడ్ మూమెంట్స్‌తో కంట్రోల్ చేయొచ్చు

ప్రముఖ టెక్ యాక్సెసరీస్ తయారీ సంస్థ నాయిస్, భారత మార్కెట్లో తమ ఉత్పత్తుల్ని క్రమంగా విస్తరింప చేస్తోంది. తాజాగా ఈ బ్రాండ్ తన సరికొత్త టివిఎస్  నాయిస్ ఇంటెల్లిబుడ్స్ ను మార్కెట్లో లాంచ్ చేసింది.

ఈ “నాయిస్ ఇంటెల్లిబుడ్స్” టివిఎస్అనేది భారతదేశపు మొట్టమొదటి ఏఐ న్యూరల్ నెట్‌తో ఆధారితం గెస్చర్ కంట్రోల్డ్‌ టివిఎస్ అని కంపెనీ పేర్కొంది.

ఈ బడ్స్ తల కదలికలను గుర్తించగలదు. ఈ సాంకేతికత వినియోగదారులు సంగీతాన్ని నియంత్రించడానికి మరియు తల కదలికల ద్వారా కాల్స్ కు సమాధానం ఇవ్వడానికి అనుమతిస్తుంది. నాయిస్ ఇంటెల్లిబుడ్స్ ఒక సారి ఫుల్ ఛార్జ్ చేయడం ద్వారా 9 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్‌బడ్స్ 600mAh బ్యాటరీతో స్మార్ట్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ మరియు ఇంస్టాఛార్జికి కూడా మద్దతునిస్తుంది.

నాయిస్ ఇంటెల్లిబుడ్స్ధర, లభ్యత:

భారతదేశంలో నాయిస్ ఇంటెల్లిబడ్స్ రిటైల్ ధరను కంపెనీ రూ.4,999 గా నిర్ణయించింది. మరియు  టివిఎస్ బ్లాక్ మరియు వైట్ రంగులలో అందుబాటులో ఉంటుంది అని కంపెనీ పేర్కొంది. ఆసక్తి గల వినియోగదారులు అక్టోబర్ 14 నుండి గోనాయిస్.కంలో ఇంటెల్లిబుడ్స్ ని కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ వెల్లడించింది.

నాయిస్ఇయర్‌బడ్స్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

నాయిస్ఇయర్‌బడ్స్‌TWS ఇయర్‌ఫోన్లు నాయిస్ ల్యాబ్స్ నుండి వచ్చిన రెండవ ఉత్పత్తిగా చెప్పబడుతుంది. ఈ TWS ఇయర్‌ఫోన్‌లు హాట్ వాయిస్ కమాండ్ వంటి టెక్నాలజీని యూజర్లకు అందిస్తాయి. వీటిని వాయిస్ కమాండ్ ద్వారా యాక్టివేట్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, కాల్‌ని అంగీకరించడం/తిరస్కరించడం, పాజ్/ప్లే/తర్వాత/మ్యూజిక్ కంట్రోలింగ్ కోసం కూడా నిర్దిష్ట కమాండ్ ఉంటుంది. అదేవిధంగా, వినియోగదారులు హాట్ వాయిస్ కమాండ్‌ని ఉపయోగించి పారదర్శకత మోడ్‌ను కూడా నియంత్రించవచ్చు.

ఈ నాయిస్ ఇంటెల్లిబడ్స్ యొక్క మరొక ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే.. ఇందులో మ్యూజిక్ షేరింగ్ ఆప్షన్ కూడా కల్పించారు.

ఇక్కడ, వినియోగదారులు సెకండరీ ఇంటెల్లిబడ్స్‌ను సులువుగా ప్రైమరీ ఇంటెల్లిబడ్స్‌తో జత చేయవచ్చు. ప్రైమరీ ఇయర్‌బడ్‌పై కుడి బడ్‌ని నొక్కి పట్టుకోవడం ద్వారా మ్యూజిక్ షేరింగ్ ఫీచర్‌ని ఎనేబుల్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్‌బడ్‌లు వినియోగదారులను చెవుల నుండి TWSని తీయకుండానే బయటి శబ్దాల్ని వినడానికి అనుమతించేలా ప్రత్యేకమైన ట్రాన్స్‌పరెంట్ మోడ్‌తో కూడా వస్తాయి, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న వినియోగదారులు నాయిస్ ఇంటెల్లిబడ్స్ ని నియంత్రించడానికి నొయిసెఫైట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నాయిస్ ఇంటెల్లిబడ్స్ ఛార్జింగ్‌!

నాయిస్ ఇంటెల్లిబడ్స్ ఒక సారి ఫుల్ ఛార్జ్ చేయడం ద్వారా 9 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్‌బడ్స్ 600mAh బ్యాటరీతో స్మార్ట్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ మరియుఇంస్టాఛార్జికి కూడా మద్దతునిస్తుంది. క్యారీ కేస్ అదనంగా 36 గంటల బ్యాటరీ లైఫ్ అందించగలదు. అందువల్ల, వినియోగదారులు నాయిస్ ఇంటెల్లిబడ్స్ తో ఎటువంటి సమస్యలు లేకుండా రెండు రోజుల పాటు ఎంజాయ్ చేయవచ్చు.

డిజైన్ పరంగా, ఈ నాయిస్ ఇంటెల్లిబడ్స్ సాధారణ TWS లాగా కనిపిస్తాయి.. అయినప్పటికీ, సాధారణ బడ్స్‌తో పోల్చినపుడు ఈ నాయిస్ ఇంటెల్లిబడ్స్ కొన్ని ఆసక్తికరమైన ఫీచర్‌లను ప్యాక్ చేసినట్లు కనిపిస్తోంది. మీరు రూ.5వేల లోపు అత్యాధునిక వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మంచి ఎంపిక అని చెప్పొచ్చు. భారతదేశంలో నాయిస్ ఇంటెల్లిబడ్స్ రిటైల్ ధరను కంపెనీ రూ.4,999 గా నిర్ణయించింది. మరియు TWS బ్లాక్ మరియు వైట్ రంగులలో అందుబాటులో ఉంటుంది అని కంపెనీ పేర్కొంది. ఆసక్తి గల వినియోగదారులు అక్టోబర్ 14 నుండి గోనాయిస్.కంలో నాయిస్ ఇంటెల్లిబడ్స్ ని కొనుగోలు చేయవచ్చు అని కంపెనీ వెల్లడించింది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *