పాత వెయ్యి నోటు ఉంటే.. రూ.3.5 లక్షలు మీ సొంతం..

రుదైన కరెన్సీ నోట్లు, నాణేలను సేకరించే వారిలో మీరు ఒకరైతే, భారీ మొత్తంలో డబ్బు సంపాదించడానికి మీకు అవకాశం వచ్చింది. ఏదైనా ప్రత్యేకమైన క్రమ సంఖ్యలు, వాటిపై ముద్రించిన చిత్రాలు, కరెన్సీ నోటు లేదా నాణేలను అరుదైనవిగా గుర్తిస్తారు.

ఇలాంటి వాటిని సొంతం చేసుకోవడానికి కొందరు పోటీ పడుతుంటారు. మోడీ ప్రభుత్వం 2016 నవంబర్ లో రూ.500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది.

సీరియల్ నంబర్

అయితే నిషేధించిన పాత వెయ్యి నోటుకు యూకేలో విపరీతమైన డిమాండ్ ఏర్పడడమే కాకుండా భారీ మొత్తానికి క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌లో అలాంటి కరెన్సీ నోటు ఒకటి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.

భారతదేశంలో చెల్లదని ప్రకటించిన 1000 రూపాయల నోటుకు నిర్దిష్ట సీరియల్ నంబర్ ఉంటే 3.5 లక్షల రూపాయలకు కొనుగోలు చేసేందుకు చాలా మంది సుముఖంగా ఉన్నారనే వార్త ప్రముఖ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

AH17 75 సీరియల్ నంబర్‌

అలాంటి నోటు మీ దగ్గర ఉంటే లండన్ వెళ్లి డబ్బు సంపాదించుకోవచ్చట. ఇంతకీ ఈ 1000 రూపాయల నోటు ప్రత్యేకత ఏంటి..? దేశంలోని డైలీ స్టార్ మ్యాగజైన్ ప్రకారం, AH17 75 సీరియల్ నంబర్‌తో ఎవరైనా ఈ ప్రత్యేకమైన భారతీయ 1000 రూపాయల నోటును కలిగి ఉంటే, దానిని 3.5 లక్షల రూపాయలకు విక్రయించవచ్చట.

ఈ 1000 రూపాయల నోటులోని ఏకైక ప్రత్యేకత దాని సీరియల్ నంబర్. ఈ అంకెలు ఒక నిర్దిష్ట క్రమంలో కనిపించే నోటుకు ప్రస్తుతం బ్రిటన్‌లో అధిక డిమాండ్ ఉందట.

జేన్ ఆస్టెన్

AH 17 75 అనే సంఖ్య ఈ క్రమ సంఖ్యను కలిగి ఉన్న బ్యాంకు నోట్లకు ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ప్రసిద్ధ ఆంగ్ల రచయిత జేన్ ఆస్టెన్ పుట్టిన తేదీ, మరణ తేదీని సూచిస్తుందట. ఆంగ్ల రచయిత్రి జేన్ ఆస్టెన్ రచనా రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందడమే కాకుండా ఆమె 6 నవలలు గొప్ప ప్రభావాన్ని చూపాయి. జేన్ ఆస్టెన్ 1775 లో జన్మించాడు. 1817 లో మరణించాడు.

బ్రిటీష్ హయాం

అందువల్ల AH17 75 సీరియల్ నంబర్ 1000 రూపాయల నోటుకు విపరీతమైన డిమాండ్ ఉంది. జేన్ ఆస్టెన్ అభిమానులు ఈ నోటును కొనుగోలు చేయడానికి రూ. 3.5 లక్షల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 1885 బ్రిటీష్ హయాంలో ముద్రించిన ఒక రూపాయి నాణెం వేలంలో రూ.10 కోట్లకు అమ్ముడుపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

భారతదేశంలో ఇటువంటి అరుదైన నాణేలు ఇండియామార్ట్‌లో అమ్ముడవుతున్నాయి. అయితే అరుదైన నాణేల పేరుతో చాలా సార్లు మోసాలు జరుగుతున్నాయని గుర్తుంచుకోండి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *