తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 20 కి .మీ వేగంతో వాయువ్య దిశగా కదిలి ఆదివారం పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీద , ఉత్తర అక్షాంశం 15.6డిగ్రీలు మరియు తూర్పు రేఖాంశం 88.4 డిగ్రీల వద్ద ,దాదాపు పోర్ట్ బ్లెయిర్‌కు వాయువ్యంగా 640 కి.మీ, సాగర్ ద్వీపానికి దక్షిణాన 670 కి.మీ మరియు బారిసాల్ (బంగ్లాదేశ్).కు దక్షిణ – నైరుతి దిశలో 820 కి.మీ.
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈరోజు అది తుపానుగా మారుతుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది మరింత వాయువ్యంగా ప్రయాణించి సోమవారం ఉదయానికి కోస్తాంధ్ర-ఒడిశా తీరాలకు దగ్గరగా వస్తుందని స్పష్టం చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం ఇది దిశమార్చుకుని ఈశాన్యం వైపు వెళ్లేందుకు అవకాశముందని ఐఎండీ తెలిపింది.
దీని ప్రభావంతో ఈ నెల 9 నుంచి.. ఏపీలోని తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలతోపాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తీర ప్రాంతంలో ఈదురుగాలులు, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముందని.. మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ ఇప్పటికే జారీచేసింది.
వాయుగుండం, తుపాను ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. వర్షాల కారణంగా రైతులు తమ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా.. ఇప్పటికే గత వారం తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు తుపాను ప్రభావంపై ఆందోళన చెందుతున్నారు.
దూరం లోను కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇది వచ్చే 12 గంటల్లో వాయువ్య దిశగా కదిలి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఎక్కువగా ఉందని, ఆ తర్వాత, వంపు తిరిగి ఉత్తర- ఈశాన్యం వైపు కదిలి ఈనెల 25 తేదీ ఉదయానికి బంగ్లాదేశ్ తీరాన్ని టింకోనా ద్వీపం మరియు శాండ్విప్ మధ్య బారిసల్‌కు దగ్గరగా దాటుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నాయని, ఆంధ్ర ప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర మరియు ఈశాన్య గాలులు వీస్తున్నాయని వీటి ఫలితంగా రాగల 48 గంటల్లో ఉత్తర, దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.