రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లిన భ మహిళను ఓ కొండచిలువ మింగేసింది. దీంతో అధికారులు ఆ కొండ చిలువ పొట్ట చీల్చి ఆమెను బయటకు తీశారు.
ఓ మహిళను ఓ భారీ కొండచిలువ అమాంతం మింగేసింది. రబ్బరు సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన 54 ఏళ్ల మహిళను మింగేసింది 22 అడుగుల పొడుగున్న భారీ కొండచిలువ.
అడవిలోకి వెళ్లిన భార్య ఎంతకీ తిరిగి రాకపోవటంతో ఆందోళన చెందిన భర్త ఆమెను వెదుకుతు అడవిలోకి వెళ్లటంతో ఓ ప్రాంతంలో కడుపు భారీగా ఉబ్బిపోయిన కొండచిలువ కనిపించేసరికి భయపడిపోయాడు. ఆ ప్రాంతంలోనే తన భార్యకు సంబంధించిన చెప్పులు ఇతర వస్తువలు కనిపించేసరికి ఆ కొండచిలువ తన భార్యను పొట్టన పెట్టుకుందని భావించాడు. భార్య కోసం ఏడ్చాడు
. ఆ కొండచిలువను చంపేయాలన్నంత కసి పుట్టింది. కానీ ఆలోచించాడు.వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని వారు కూడా ఆ కొండచిలువను చూసి సదరు మహిళను అది మింగేసిందని గ్రహించారు. దీంతో స్థానికుల సహాయంతో ఆ కొండచిలువ కడుపు చీల్చి మహిళ కళేబరాన్ని బయటకు తీసిన ఈ అత్యంత భయానకమైన ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది.
ఇండోనేషియాలోని జాంబీ ప్రాంతంలో రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లిన జరా అనే మహిళ ఓ భారీ కొండచిలువకు బలైపోయింది అడవికి వెళ్లిన భార్య ఎంతకీ తిరిగిరాకపోవటం అంతా వెతికాడు ఆమె భర్త. అలా రెండు రోజులు అడవిలో వెతగ్గా వెతగ్గా అతనికి అడవిలో ఓ చోట ఆమె చెప్పులు, జాకెట్, హెడ్స్కార్ఫ్, కత్తి కనిపించాయి. ఆ చుట్టు పక్కల వెదికాడు. భార్యను పేరుతో పిలుస్తూ అరిచాడు. కానీ ఎటువంటి స్పందనా రాలేదు. అలా ఆమెను వెదుకుతుండగా కొంత దూరంలో ఓ భారీ కొండచిలువ పొట్ట ఇంతలావున ఉబ్బి కనిపించేసరికి హడలిపోయాడు. తన భార్యను మింగేసిందని భయాందోళనకు గురి అయ్యాడు. వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. సహాయక సిబ్బందితో కలిసి అదే ప్రదేశానికి చేరుకున్న అధికారులు దాని కడుపు ఉబ్బెత్తుగా ఉండడంతో అనుమానించారు
కనిపించకుండాపోయిన జరాను అది మింగేసి ఉంటుందని భావించి దానిని బంధించారు. ఆ తర్వాత గ్రామస్థులందరూ కలిసి దానిని చంపి పొట్టను చీల్చారు. పూర్తిగా జీర్ణం కాని స్థితిలో ఉన్న మహిళ కళేబరాన్ని బయటకు తీశారు. జరాను మింగేందుకు కొండచిలువకు కనీసం రెండు గంటల సమయం పట్టి ఉంటుందని స్థానిక అధికారులు తెలిపారు. ఆమెను మింగడానికి ముందు చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా..ఇదే ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం 27 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించిందని స్థానికులు అధికారులకు తెలిపారు. తమకు ఏమవుతుందోనని ఆందోళనగా ఉందని విన్నవించుకున్నారు.