ఇకపై ఆ స్మార్ట్ ఫోన్ లకు చార్జర్ ఉండదు.. కావాలంటే ఆ పని చెయ్యాల్సిందే

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యవసరంగా మారిపోయిన వాటిలో సెల్ ఫోన్ ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు సెల్ ఫోన్స్ చేతిలో పట్టుకుని కాలక్షేపం చేస్తుంటారు. సెల్ ఫోన్ ఉపయోగించాలంటే తప్పని సరిగా చార్జింగ్ ఉండాలి…కానీ ఇదేంటి అస్సలు ఛార్జింగ్ ఏ అవసరం కాలేదు అంటున్నారు అని విచిత్రం గ ఉందా…

ఇన్నాళ్లు ప్రతి ఒక్క కొత్త మొబైల్ కు సెల్ ఫోన్ బాక్స్ లో తప్పనిసరిగా చార్జర్ ని కూడా వినియోగదారులకు ఇచ్చేవారు. అయితే ఇకపై సెల్ ఫోన్ బాక్స్ లో చార్జర్ ఉండదని సమాచారం

ఇప్పటికే సాంసంగ్ ప్రీమియర్ మొబైల్ ఫోన్స్ లో చార్జర్లు లేకుండా కేవలం మొబైల్ ఫోన్లను మాత్రమే ఇస్తున్నారు.

ఇక ఇదే విధానాన్ని ఆపిల్, ఒప్పో వంటి మొబైల్ ఫోన్స్ కూడా అనుసరించనున్నాయి. ఇలా మొబైల్ ఫోన్లకు చార్జర్లు ఇవ్వకపోవడం వల్ల మొబైల్ కంపెనీ ఫోన్లపై అధిక వ్యయ బారం తగ్గడమే కాకుండా పర్యావరణ వ్యర్థాలు కూడా తగ్గుతాయని పలు కంపెనీలు భావించి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు….ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్లకు యూఎస్ బీ, టైప్ సీ చార్జింగ్ పోర్ట్‌ను పెట్టాలని కంపెనీలను కోరింది. తద్వారా ఫోన్ కొన్న ప్రతిసారి చార్జర్ కొనాల్సిన పని ఉండదు.అయితే ఇది అన్ని రకాల ఫోన్లకు వర్తించదని కేవలం ఖరీదైన ఫోన్లకు మాత్రమే అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒప్పో ఓవర్సీస్ సేల్స్ ప్రెసిడెంట్ బిల్లీ జాంగ్ ఈ విషయంపై స్పందించి వచ్చే ఏడాది నుంచి కొన్ని ఉత్పత్తులకు బాక్స్ నుంచి చార్జర్ తొలగించనున్నామని పేర్కొన్నారు.

ఒక ప్రకటనలో, “మేము అనేక ఉత్పత్తుల కోసం వచ్చే సంవత్సరంలో బాక్స్ నుండి ఛార్జర్‌ను తీసివేస్తాము. మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. వినియోగదారులు [SuperVOOC ఛార్జర్‌లు] యాక్సెస్ పొందడం అంత సులభం కాదు, కాబట్టి మేము దానిని పెట్టెలో ఉంచాలి. అయినప్పటికీ, మేము మా వ్యాపార కార్యకలాపాలను విస్తరింపజేస్తున్నందున, మేము ఛార్జర్‌లను బాక్స్ నుండి తీసి వాటిని స్టోర్‌లో ఉంచాలని చూస్తున్నాము, తద్వారా మా వినియోగదారులు తమ పరికరాన్ని అప్‌గ్రేడ్ చేసినప్పుడు కూడా ఛార్జర్‌లను కొనుగోలు చేయగలరు మరియు వాటిని ఉపయోగించడం కొనసాగించగలరు

కంపెనీ బాక్స్ నుండి ఛార్జర్‌ను తీసి విడిగా అమ్మకానికి ఉంచుతుంది కాబట్టి వినియోగదారులు ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసిన తర్వాత కూడా దాన్ని ఉపయోగించడం కొనసాగించవచ్చు

Previous Post
Next Post