పొరపాటున ఇతర అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బును తిరిగి పొందడం ఎలా

ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయ్యిపోవడం వాళ్ళ అందరు మనీ ని అంత ఫోన్స్ లోనే క్యారీ చేస్తున్నారు బై హ్యాండ్ మనీ తక్కువ అయ్యిపోయింది …. . చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేస్తున్నారు. ఒక్కోసారి పొరపాటున ఒకరికి పంపాల్సిన డబ్బును మరొకరి అకౌంట్‌కు పంపుతుంటాం…

ఇలా వేరే అకౌంట్‌కు పంపిన డబ్బును తిరిగి మనం పొందగలమా?

దీని గురించి తెలుసుకోవడానికి ఒక ప్రైవేట్ బ్యాంక్ సౌత్ జోన్ మేనేజర్‌ మణియన్ కళియమూర్తిని బీబీసీ సంప్రదించింది. ఈ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది….

సాధారణంగా ఇలాంటి కేసులకు బ్యాంకులు బాధ్యత వహించవు. పొరపాటున డబ్బు పంపిన వ్యక్తిదే పూర్తి బాధ్యత ఉంటుంది. కాకపోతే, ఆ వ్యక్తి తిరిగి డబ్బు పొందేందుకు బ్యాంకులు సహకరిస్తాయి” అని ఆయన చెప్పారు.

ఒక బ్యాంక్ బ్రాంచ్ నుంచి నేరుగా డబ్బు పంపినప్పుడు బ్యాంకు ఉద్యోగులు అకౌంట్ వివరాలను, పేరును తనిఖీ చేస్తారు. ఒకవేళ అకౌంట్ నంబర్‌లో ఒకట్రెండు అంకెలు తప్పుగా ఉంటే రికార్డుల్లో ఉన్న పేరుతో ఆ అకౌంట్ నంబర్ సరిపోలదు. దీంతో బ్యాంక్ వెంటనే ఆ నగదు బదలాయింపును తాత్కాలికంగా నిలిపేసి, సదరు వ్యక్తికి దీని గురించి సమాచారం అందిస్తుంది…

కానీ అధికారిక నెట్ బ్యాంకింగ్ యాప్‌లు, బ్రౌజర్ ఆధారిత నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐల ద్వారా డబ్బు పంపిస్తున్నప్పుడు బ్యాంకులు ఆ లావాదేవీల వివరాలను ధ్రువీకరించలేవు.         డబ్బులు పంపించే వ్యక్తి స్వయంగా అకౌంట్ వివరాలను నమోదు చేసి, దాన్ని ధ్రువీకరించి డబ్బును పంపుతారు

ఒకవేళ అతను డబ్బును పొరపాటున వేరొకరి ఖాతాను పంపిస్తే, దానికి మొత్తం బాధ్యత అతనే వహించాల్సి ఉంటుంది. కానీ, వారు తమ డబ్బును తిరిగి పొందడంలో బ్యాంకులు సహాయం చేస్తాయి” అని ఆయన వివరించారు.

గూగుల్ పే, పేటీఎం చెల్లింపులకు కూడా ఇదే వర్తిస్తుందా?

బ్యాంకు లావాదేవీలు జరపాలంటే అకౌంట్ నంబర్ అవసరం. కానీ, యూపీఐ లావాదేవీలకు అకౌంట్ నంబర్‌తో పని లేదు. ఫోన్ నంబర్ ఆధారంగా యూపీఐ లావాదేవీలు జరుపవచ్చు. ఒకవేళ ఫోన్ నంబర్‌ను తప్పుగా ఎంటర్ చేసి డబ్బును పంపిస్తే మనం థర్డ్ పార్టీ యాప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

   అక్కడ కూడా ఇదే ప్రక్రియను అనుసరించాలి. బ్యాంక్‌కు వెళ్లి సదరు వ్యక్తికి చెందిన బ్యాంక్ వివరాలు కనుక్కోవడంతో పాటు లావాదేవీకి సంబంధించిన రుజువులు, అభ్యర్థన పత్రాన్ని బ్యాంక్ వారికి సమర్పించాలి.తర్వాత బ్యాంక్ వారు సదరు వ్యక్తిని డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా కోరతారు. ఒకవేళ వారు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసి, అతని అకౌంట్‌ను ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది.ఇక్కడ కూడా అదే పరిస్థితి. సదరు వ్యక్తి డబ్బు చెల్లిస్తే సమస్య తీరుతుంది. లేకపోతే వారు ఇచ్చేవరకు ఎదురు చూడాల్సిందే…

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *