మరొకసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన బంధన్ బ్యాంకు!

మరొకసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన బంధన్ బ్యాంకు!

దేశీయ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన బంధన్ బ్యాంకు, తన బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన కొత్త రేట్లు డిసెంబర్ 06, 2022 నుంచి అనగా ఈ రోజు నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. వడ్డీ రేట్లను సవరించిన తరువాత, బ్యాంకు ఇప్పుడు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ కలిగిన డిపాజిట్లపై 3.25 శాతం నుంచి 5.00 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. 365 రోజుల నుంచి 15 నెలల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.25 శాతం గరిష్ట వడ్డీ రేటును బ్యాంకు అందిస్తుంది.

ఫిక్స్డ్ డిపాజిట్లపై బంధన్ బ్యాంకు అందిస్తున్న వడ్డీ రేట్లను ఒకసారి పరిశీలిస్తే,

7 రోజుల నుంచి 28 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

29 రోజుల నుంచి 90 రోజుల వరకు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 5.55 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

91 రోజుల నుంచి 364 రోజుల వరకు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

365 రోజుల నుంచి 15 నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

5 నెలల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.15 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 5.00 శాతం వడ్డీ రేటును

అందిస్తుంది.

ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ ను ముందస్తుగా ఉపసంహరించుకున్నట్లయితే, అప్పుడు 1 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగు సార్లు రెపో రేటును పెంచుకుంటూ వచ్చింది, దీంతో బ్యాంకులు కూడా తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచవలసి వచ్చింది. అయితే, కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ద్రవ్యోల్బణాన్ని అధిగమించే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

తాజాగా ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం డిసెంబర్ 5 న ప్రారంభమైంది, ఇది మూడు రోజుల పాటు జరగనుంది. ఆర్బీఐ డిసెంబర్ 7న రెపో రేటు సర్దుబాటుపై తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. అయితే, ఎంపీసీ రెపో రేటును 25 నుంచి 35 బేసిస్ పాయింట్ల మేర పెంచే అవకాశం ఉన్నట్లు కొంతమంది ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *