ఫ్లిప్‌కార్ట్‌ క్రేజీ ఆఫర్స్.. రూ.5 వేలకే టీవీ, రూ.7 వేలకే ఫ్రిజ్

దేశంలో పండగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌.. ప్రత్యేక సేల్ బిగ్ బిలియన్ డేస్ 2022 ను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30 వవరకు 8 రోజుల పాటు జరగనుంది. తేదీ నుంచి ప్రారంభం కానుంది. సేల్ కు సమయం దగ్గరపడడంతో.. ఆకర్షణీయమైన డీల్స్ ను ఫ్లిప్‌కార్ట్‌ ఒక్కక్కటిగా రివీల్ చేస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషిన్ లు, క్లాతింగ్, ఫర్నిచర్ ఐటమ్స్, కిచెన్ వేర్ ఐటమ్స్.. ఇలా ఒక్కటేమిటి అన్నింటిని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన ఆఫర్లు సేల్ లో ఉండనున్నాయి.

కొత్తగా టీవీ, ఫ్రిజ్ కొనాలనే ఆలోచనలో ఉన్నవారికి ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ సువర్ణావకాశం అని చెప్పొచ్చు. అసలు ధరలపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లు ప్రకటించగా, కార్డు ఆఫర్లతో కొనుగోలు చేస్తే అంతకన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. బిలియన్ డేస్ కంటే ముందుగా కూడా వీటిని అదే ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాంటి ఆఫర్ వివరాలను కొన్నింటిని మీకు తెలియజేస్తున్నాం..

టీవీలపై ఆఫర్లు:

క్యాండెస్ 24 ఇంచెస్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ: దీని అసలు ధర రూ. 15,990కాగా, 63% డిస్కౌంటుతో రూ. 5,849 ధరకు ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంది. అలాగే.. కొనుగోలు సమయంలో ఫ్లిప్‌కార్ట్

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లయితే.. రూ. 300 తగ్గింపు లభిస్తుంది. అంటే.. దీన్ని రూ. 5,550కే కొనుగోలు చేయవచ్చు.

క్యాండెస్ 24 ఇంచెస్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: దీని అసలు ధర రూ. రూ. 17,990కాగా, రూ. 6,990కు కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 350 తగ్గింపు ఉంది. అంటే.. దీన్ని రూ. 6,640కే సొంతం చేసుకోవచ్చు.

కొడాక్ 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ: దీని అసలు ధర రూ. 15,999కాగా, ఇప్పుడు రూ. 6,999కు అందుబాటులో ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 700 అదనపు తగ్గింపు లభిస్తుంది. కార్డు ఆఫర్ తో కలుపుకొని దీన్ని రూ.6,299కు కొనుగోలు చేయవచ్చు.

డైనోరా 24 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ: దీని అసలు ధర రూ. 12,999కాగా, రూ. 6629కు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. రూ. 330 మేర తగ్గింపు లభిస్తుంది. మొత్తంగా రూ.6300 ధరకు సొంతం చేసుకోవచ్చు.

ఫ్రిజ్ లపై ఆఫర్లు:

క్యాండెస్ 170 లీటర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్: దీని అసలు ధర రూ. 12,000కాగా, రూ. 9,990కు అందుబాటులో ఉంది. ఆఫర్ కలుపుకుంటే రూ. 8540కే ఈ ఫ్రిజ్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు. ప్రిపెయిడ్ ఆఫర్‌పై రూ. 500, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డుపై రూ. 950 తగ్గింపు ఉంది.

మార్క్యూ 190 లీటర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్: దీని అసలు ధర రూ. 12,999కాగా, రూ. 8,999కు అందుబాటులో ఉంది. ఆఫర్లు కలుపుకుంటే రూ. 8,100కే కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్,

ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ. 899 తగ్గింపు ఉంటుంది.

ఒనిడా 190 లీటర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్: ఇది రూ.11,490కు అందుబాటులో ఉంది. ఆఫర్ కింద రూ.10,341కు పొందొచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ. 1150 తగ్గింపు ఉంది. ఈ ఫ్రిజ్ అసలు ధర రూ. 18,990.

పైన పేర్కొన్న ఆఫర్లన్నీ.. తక్కువ ధరను ఉద్దేశించి చెప్పబడినవి. బడ్జెట్ ధరలో, ప్రీమియం రేంజ్ లో ఆఫర్ల వివరాలు కావాలంటే..మా సైట్ ను నిరంతరం ఫాలో అవ్వగలరు. అలాగే.. ఈ ధరలు ఫ్లిప్‌కార్టులో పొందుపరిచిన వివరాలను బట్టి అందిస్తున్నాం..

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *