అయితే ఈ 5జీ సేవల్లో వాడే రేడియో స్పెక్ట్రమ్‌ను టార్గెట్ చేసి, ఫోన్ ట్యాప్ చేయకుండానే మాటలు రికార్డు చేసే టెక్నాలజీని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ ప్రయోగం చేశారు. దీనిలో భాగంగా ఒక ఆఫ్-ది-షెల్ఫ్ ఆటోమోటివ్ రాడార్‌ను ఒక గదిలో పెట్టారు. ఆ గదిలోకి కొంతమందిని పంపించి, ఫోన్‌లో మాట్లాడాలని చెప్పారు.
ఇప్పటి వరకు ఎవరి ఫోన్ కాల్స్ అయినా వినాలంటే వాటిని ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే భవిష్యత్తులో ఇక ట్యాపింగ్ అవసరం ఉండదేమో? ఎందుకంటే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రజలు కూడా వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
అదే సమయంలో రాడార్ పంపే తరంగాల ద్వారా వాళ్లు మాట్లాడే మాటలను అంచనా వేశారు. ఈ ప్రయోగంలో గదిలో ఉన్న వాళ్లు మాట్లాడిన వాటిలో 83 శాతం మాటలు రికార్డు అయ్యాయి. దీనిలో వాడిన రాడార్ మిల్లమీమీటర్ వేవ్ స్పెక్ట్రమ్‌లో పని చేస్తుందట. పర్టిక్యులర్‌గా 60 నుంచి 64 గిగాహెర్ట్జ్, 77 నుంచి 81 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ తరంగాలను ఇది పట్టేస్తుంది.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న 5జీ సేవల్లో ఎక్కువగా ఉపయోగించే ఫ్రీక్వెన్సీ ఇదే. మనం మాట్లాడే సమయంలో ఆ మాటల ఫ్రీక్వెన్సీ మొబైల్ మొత్తం వ్యాపిస్తుందని, దీన్నే ఈ రాడార్ పసిగడుతుందని పరిశోధకులు తెలిపారు. ‘ఎంఎంస్పై’ అని పిలుస్తున్న ఈ టెక్నాలజీ వల్ల మంచి కూడా ఉంటుందని వాళ్లు చెప్తున్నారు.
ప్రస్తుతం మొబైల్స్, స్మార్ట్ వాచ్‌లలో మన శరీరంలోని హార్ట్ రేట్, టెంపరేచర్ వంటి వాటిని మానిటర్ చేస్తూ ఉంటాం కదా. వీళ్లు తయారు చేస్తున్న టెక్నాలజీని ఈ సెన్సర్లకు జతచేస్తే.. రేటింగ్‌లో మార్పు రాగానే ఆస్పత్రికి కాల్ చేసే సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకురావచ్చట. ఇదే విషయాన్ని పరిశోధకులు చెప్తున్నారు
.