ఆండ్రాయిడ్‌ ఫోన్ యూజర్లకు అలర్ట్‌.. ఆ నాలుగు యాప్స్‌ వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేయండి..

ఆండ్రాయిడ్‌  స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు హెచ్చరిక.

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు హెచ్చరిక. లక్షల కొద్దీ డౌన్‌లోడ్స్‌ ఉన్న కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్‌, వైరస్‌తో నిండి ఉన్నాయని తాజా నివేదికలు గుర్తించాయి.

లక్షల కొద్దీ డౌన్‌లోడ్స్‌ ఉన్న కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్‌, వైరస్‌తో నిండి ఉన్నాయని తాజా నివేదికలు గుర్తించాయి. వీటి ద్వారా సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వైరస్‌తో ఇన్‌ఫెక్ట్‌ అయిన గూగుల్‌ ప్లే స్టోర్‌ యాప్స్ లిస్ట్‌ను తాజాగా విడుదల చేసింది సైబర్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ప్రొవైడర్‌ మాల్‌వేర్‌బైట్స్‌ . ఈ కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో వివరాలు వెల్లడించింది.

డెవలపర్ మొబైల్ యాప్‌ల గ్రూప్ నుంచి హానికరమైన యాప్‌లు గూగుల్‌ ప్లే స్టోర్‌లో లిస్ట్‌ అయ్యాయని మాల్‌వేర్‌బైట్స్‌ రిపోర్ట్ తెలిపింది. ఇవి ఆండ్రాయిడ్/ ట్రోజన్.హిడ్డెన్డ్స్.బిట్గ్త్బ్. మాల్వేర్‌తో ఇన్‌ఫెక్ట్‌ అయ్యాయని పేర్కొంది. ఈ లిస్ట్‌లోని నాలుగు యాప్‌లు కొంతకాలం వరకు మాల్వేర్‌ బిహేవియర్‌ను చూపవని, కొంత సమయం తర్వాత గూగుల్‌ క్రోమ్‌లో ఫిషింగ్ సైట్‌లను ఓపెన్‌ చేయడం ప్రారంభిస్తాయని వెల్లడించింది.

యాప్ పేర్లు ఏంటి? : బ్లాగ్ పోస్ట్‌లో ట్రోజన్ మాల్వేర్‌తో బగ్ చేసిన నాలుగు యాప్‌లను కంపెనీ పేర్కొంది. అందులో బ్లూటూత్ ఆటో కనెక్ట్ , బ్లూటూత్‌ యాప్‌ సెండర్‌ , డ్రైవర్: బ్లూటూత్, యూఎస్‌బీ, వైఫై , మొబైల్ ట్రాన్స్‌ఫర్‌: స్మార్ట్ స్విచ్ యాప్‌లు ఉన్నాయి

ఈ యాప్‌లకు పది లక్షల కంటే ఎక్కువ డౌన్‌లోడ్స్ ఉన్నాయని బ్లాగ్‌ పోస్ట్‌ పేర్కొంది. ఈ యాప్‌ల పాత వెర్షన్లను ఇప్పటికే ఆండ్రాయిడ్/ట్రోజన్.హిడ్డెన్డ్స్ విభిన్న వేరియంట్లుగా గుర్తించారు. అయినప్పటికీ డెవలపర్ – మొబైల్ యాప్స్‌ గ్రూప్‌ ఇప్పటికీహిడెన్ యాడ్స్మాల్వేర్‌ను స్ప్రెడ్‌ చేస్తూ గూగుల్‌ ప్లేస్టోర్‌లో లిస్ట్‌ అయి ఉంది.

ఈ యాప్‌లు ఎలా పని చేస్తాయి? : ఈ యాప్‌లు మాల్‌వేర్ బిహేవియర్‌ను వెంటనే చూపడం లేదని మాల్‌వేర్‌బైట్స్‌ పేర్కొంది. గమనించకుండా ఉండేందుకు వెంటనే పనులు ప్రారంభించకుండా ఆలస్యం చేయడం మాల్వేర్ డెవలపర్‌ల వ్యూహమని తెలిపింది. మొబైల్స్‌లో చొరబడిన కొంత కాలం తర్వాత ఈ యాప్‌లు క్రోమ్ బ్రౌజర్‌లో ఫిషింగ్ సైట్‌లను తెరుస్తాయని బ్లాగ్ పోస్ట్ పేర్కొంది.

అయితే ఈ ఫిషింగ్ వెబ్‌సైట్‌ల కంటెంట్ మారుతూ ఉంటుంది. కొన్ని హాని చేయనివి అయితే, పే పర్‌ క్లిక్‌ ప్రొడ్యూస్‌ చేయడానికి ఉపయోగిస్తారు. మరికొన్ని ప్రమాదకరమైన సైట్‌లు ఉంటాయి, వీటి ద్వారా వినియోగదారులను మోసగిస్తారు. ఉదాహరణకు ఒక సైట్‌లో అడల్ట్ కంటెంట్‌ ఉంటుంది, అది ఫిషింగ్ పేజీలకు దారి తీస్తుంది, ఈ సమయంలో వైరస్‌ ఇన్‌ఫెక్ట్‌ అయినట్లు వినియోగదారులు గుర్తించాలి.

 లాక్‌ చేసినా పని చేస్తున్న వైరస్‌ : మొబైల్ డివైజ్‌ లాక్ అయి ఉన్నప్పుడు కూడా క్రోమ్‌ బ్రౌజర్‌ ట్యాబ్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. వినియోగదారు వారి డివైజ్‌ను అన్‌లాక్ చేసినప్పుడు, క్రోమ్‌ లేటెస్ట్‌ సైట్‌తో ఓపెన్‌ అవుతుంది. వినియోగదారులు ఈ యాప్‌లలో దేనినైనా ఇన్‌స్టాల్ చేసి ఉంటే వారి స్మార్ట్‌ఫోన్‌ల నుంచి అన్‌ఇన్‌స్టాల్‌ చేయడం మంచిది. అలాగే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసే ముందు పర్మిషన్లు, డెవలపర్‌ల సమాచారాన్ని చెక్‌ చేయాలని టెక్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *