ఇంత తక్కువ ధరకు వాషింగ్ మిషన్ ఇంకెప్పుడూ కొనలేరు.. ఫ్లిప్‌కార్ట్ లో రూ.4 వేలకే.. ఓ లుక్కేయండి

ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తాజాగా దీపావళి సేల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్ లు, వాషింగ్ మిషన్లు తదితర వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వాషింగ్ మిషన్ వినియోగం అందరికీ తప్పనిసరిగా మారింది

అనేక మంది సామన్యులు తక్కువ ధరలో లభించే వాషింగ్ మిషన్ కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వారికి ఫ్లిప్ కార్ట్ శుభవార్త చెప్పింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దీపావళి సేల్ లో వాషింగ్ మిషన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటిచింది. రూ.5 వేలలోపు సైతం ఆఫర్లపై వాషింగ్ మిషన్లు అందుబాటులో ఉండడం విశేషం.

ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్క్యూ 7.5 కిలోల వాషర్ మాత్రమే తెలుపు, ఆకుపచ్చపై ఈ సేల్ లో భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ.8,999 కాగా.. 44 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా 4,009 రూపాయల తగ్గింపుతో రూ.4,990కే సొంతం చేసుకోవచ్చు

ఇంకా ఈ వాషింగ్ మిషన్ పై ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం అదనంగా క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. ఇంకా ఈ వాషింగ్ మిషన్ పై భారీ ఎక్సేంజ్ ఆఫర్ సైతం అందుబాటులో ఉంది.

మీరు మీ పాత వాషింగ్ మిషన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.2,200 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. మీ పాత వాషింగ్ మిషన్ మోడల్, కండిషన్ పై మీకు లభించే ఎక్సేంజ్ ఆఫర్ మొత్తం ఆధారపడి ఉంటుంది.

ఈ ఆఫర్ మీకు పూర్తిగా అప్లై అయితే.. రూ.2,790కే ఈ వాషింగ్ మిషన్ ను సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ వాషింగ్ మిషన్ లో కేవలం వాషర్ మాత్రమే ఉంటుంది. రెండు వాష్ ప్రోగ్రామ్ లు ఉంటాయి.

తక్కువ ధరలో వాషింగ్ మిషన్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది బెస్ట్ ఆఫర్ గా చెప్పవచ్చు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *