మీకు రిలయన్స్ జియో లేదా వోడాఫోన్ నంబర్ ఉందా?
అయితే ఈ రెండింట్లో ఏదైనా నెట్‌వర్క్ నుంచి ఎయిర్టెల్కి మారాలనుకుంటున్నారా?
టెలికాం ఆపరేటర్ సులభమైన పోర్టబిలిటీ సర్వీసును అందజేస్తుంది. ఈ సర్వీసు ద్వారా మీ ప్రస్తుత మొబైల్ నంబర్‌ను మార్చకుండానే జియో లేదా Vi నుంచి సులభంగాఎయిర్టెల్కి మారవచ్చు. ఏదైనా నంబర్‌ను ఎయిర్టెల్ కి పోర్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మీ సిమ్ ను ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్‌కు పోర్ట్ చేయడానికి.. మీ ఆధార్ కార్డ్ వివరాలు లేదా ఏదైనా ఇతర అధికారిక ఐడి ఉంటే చాలు.. ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.
ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి ఒకటి లేదా రెండు రోజులు పడుతుందని పేర్కొంది. మీరు మీ ప్రస్తుత ఆపరేటర్‌ను ఎయిర్టెల్ కి పోర్ట్ చేయాలనుకుంటే.. మీరు ఈ కింది విధంగా ఫాలో కావాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో Vi, బిసన్ల్ , ఇతరులతో సహా యూజర్లందరూ మొబైల్ నంబర్‌ను మార్చకుండానే ఎయిర్‌టెల్‌కి నెట్‌వర్క్‌ను పోర్ట్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్ నంబర్ మార్చకుండా ఎయిర్టెల్కి పోర్ట్ చేయాలంటే?
అధికారిక ఎయిర్టెల్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
* మెను నుంచి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి..పోర్ట్ to ఎయిర్టెల్ పోస్టుపైడ్ ఎంచుకోండి.
* యమన్ పి ప్రాసెస్ ప్రారంభించేందుకు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోండి.
* ఈ ప్లాన్‌లు రూ. 299 నుంచి ప్రారంభమవుతాయి.
* ఆ తర్వాత.. మీ ఫారమ్‌ను నింపడం ద్వారా డోర్‌స్టెప్ కెవైసిని షెడ్యూల్ చేసుకోవచ్చు.
* మీ కెవైసిలో పేరు, అడ్రస్, మీరు పోర్ట్ చేయాలనుకునే ఫోన్ నంబర్, ఇతర వివరాలను నింపండి.
సిమ్ కార్డ్‌తో రిజిస్టర్ అయిన వ్యక్తి పేరును తప్పక ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
* అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత సబ్మిట్బటన్‌పై క్లిక్ చేయండి.
* ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసేందుకు మీ ఇంటి వద్దకే SIMని డెలివరీ చేస్తారు.
* అయితే ముందుగా కాల్‌లో మిమ్మల్ని సంప్రదిస్తారు.
* మీరు డెలివరీ సమయంలోఎయిర్టెల్నుంచి అందుకున్న మీ ఐడి ప్రూఫ్, 8 అంకెల యునిక్ పోర్టింగ్ కోడ్ ని షేర్ చేయాలి.
* ఈ ప్రక్రియ 2 రోజుల్లో లేదా 48 గంటల్లో పూర్తవుతుంది.
* సిమ్ డెలివరీ చేసిన తర్వాత.. మీరు మీ సిమ్ ని డెలివరీ చేసే ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్‌కు రూ. 100 రుసుమును చెల్లించాలి.
* మీ యమన్ పిప్రక్రియను ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లో ట్రాక్ చేసేందుకు ఆప్షన్ ఉంది.
* మీరు మీ పోర్ట్-ఇన్ నంబర్‌ని ఉపయోగించి యాప్‌లోకి సైన్ ఇన్ చేయాలి.
* ఈ ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదురైతే.. మీ మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేసేందుకు మీ సమీపఎయిర్టెల్ స్టోర్‌కు వెళ్లవచ్చు.