గూగుల్‌ హెచ్చరికలు, ఈ 16 యాప్స్‌ చాలా డేంజర్​..వెంటనే డిలీట్‌ చేసుకోండి

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ వినియోగదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్‌ ప్లేస్టోర్‌లో ప్రమాదకరమైన 16 యాప్స్‌ను తొలగించినట్లు తెలిపింది.

ఆ యాప్స్‌ను యూజర్లు వినియోగిస్తున్నట్లైతే వెంటనే వాటిని డిలీట్‌ చేయాలని కోరింది

గూగుల్ ప్లే స్టోర్‌లో  కనిపించే అన్ని యాప్స్ సెక్యూర్ కాదు.. అందులో చాలావరకూ ఫేక్ యాప్స్  అధికంగా ఉంటాయి. యూజర్లను అట్రాక్ట్ చేసేలా యాప్స్ డిజైన్ చేస్తారు. ఇలాంటి యాప్స్ కనిపించగానే యూజర్లు తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసేసుకుంటారు. ఆయా యాప్ డెవలపర్లు వెంటనే యూజర్ల డేటాను తస్కరిస్తుంటారు. యూజర్ల ప్రైవసీ  పరంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే తెలిసో తెలియకో ఏదైనా యాప్ ఇన్ స్టాల్ చేసినప్పుడు ఆ యాప్ రివ్యూలు రేటింగ్ చూస్తుండాలి. అప్పుడే ఆ యాప్ ఎంతవరకు బెటర్ అనేది నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత ఫోన్లలో యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. కానీ, యూజర్లు యాప్స్ గురించి అవగాహన లేకుండానే తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. ప్రైవసీపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అందుకే గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు కూడా యూజర్ల ప్రైవసీ దృష్ట్యా ఆయా యాప్స్ గురించి ప్లే స్టోర్‌లో స్కాన్ చేస్తున్నాయి. ఏమైనా హానికర యాప్స్  ఉన్నాయంటే వెంటనే తమ ప్లాట్ ఫాం నుంచి డిలీట్ చేస్తున్నాయి. ఇప్పటికే క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ జెడ్ స్కాలర్ ఇప్పుడు గూగుల్ ఇటీవల 50కిపైగా యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఎందుకంటే అందులో ఎక్కువగా మాల్వేర్ యాప్స్ ఉన్నాయి. నివేదికలో జెడ్ స్కాలర్ తమ థ్రెట్లేబ్జ్ టీమ్ సాయంతో గూగుల్ ప్లేలో మూడు వేర్వేరు మాల్వేర్ విభాగాలైన Joker, ఫేసెస్ట్ల్ర్, కాపర్ తో యాప్‌లను గుర్తించాయి. ఈ యాప్‌లలో చాలా వరకు జోకర్ మాల్వేర్ ఉందని నివేదిక పేర్కొంది, నిస్సందేహంగా ఆండ్రాయిడ్డివైజ్‌లను లక్ష్యంగా చేసుకున్న ప్రముఖ మాల్వేర్ ఫ్యామిలీల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. జోకర్ మాల్వేర్ ‘కోడ్, ఎగ్జిక్యూషన్ మెథడ్స్, పేలోడ్-రిట్రీవింగ్ టెక్నిక్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లతో సహా మాల్వేర్ ట్రేస్ సిగ్నేచర్‌లను సవరించిందని నివేదిక పేర్కొంది.

బ్యాటరీని నాశనం చేయడం, డేటా వినియోగం ఎక్కువ అయ్యేలా చేసే 16 యాప్స్‌ ప్లేస్టోర్‌లో ఉన్నట్లు గూగుల్‌ గుర్తించింది. ఇప్పటికే 20 మిలియన్ల మంది ఇన్‌స్టాల్‌ చేసుకున్న సదరు యాప్స్‌ యూజర‍్లు ఉపయోగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. తమ యాప్స్‌ ఓ భద్రతా సంస్థ నుంచి గుర్తింపు పొందినవని చెబుతూ తప్పుడు ప్రకటనలతో యూజర్లను ఏమార్చే ప్రయత్నం

జరుగుతున్నట్లు గూగుల్‌ పేర్కొంది.

ఆర్స్ టెక్నికా నివేదిక ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నుండి 16 అప్లికేషన్‌లను తొలగించింది. ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ  గుర్తించిన ఈ ప్రమాదకరమైన యాప్స్‌ను గతంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లలో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉన్నట్లు తెలిపింది. క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్ చేయడానికి, మొబైల్‌, లేదంటే టాబ్లెట్‌లలో ఫ్లాష్‌ను టార్చ్‌గా ఆన్ చేయడానికి లేదా వివిధ రకలా అవసరాల కోసం వినియోగించేందుకు ఉపయోగపడినట్లు తెలిపింది. ఇప్పుడు అవే యాప్స్‌ యూజర్లకు నష్టం కలిగిస్తున్నట్లు మెకాఫీ ప్రతినిధులు తెలిపారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *