ప్రస్తుతం తక్కువ ధరలకు ఫోన్లు లభిస్తుండడం, డేటా రేట్లు తగ్గడం వంటి కారణాలతోస్మార్ట్‌ఫోన్లు వాడేవారి సంఖ్య పెరిగింది.
దీంతోపాటుసోషల్ మీడియావినియోగం, అలాగే సైబర్ నేరాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసే సైబర్ కేటుగాళ్లు , యూజర్ల పర్సనల్ డేటాను దొంగిలిస్తున్నారు. తర్వాత కీలక సమాచారం బహిర్గతం చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అందుకే యూజర్లు సోషల్ మీడియా అకౌంట్‌లను సేఫ్‌గా ఉంచుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అకౌంట్ హ్యాక్ అయినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పెంచుకోవాలి. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయితే ఎలా రికవర్ చేయాలో తెలుసుకుందాం.
ఇన్‌స్టాగ్రామ్‌ను రిజిస్టర్ చేసిన ఇమెయిల్ అడ్రస్‌ను మారిస్తే సెక్యూరిటీ@మెయిల్.ఇంస్టాగ్రామ్.కం నుంచి ఇమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇమెయిల్ మారుస్తున్నట్లు తెలిస్తే.. మెయిల్‌లోని అకౌంట్ సెక్యూర్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే.. తిరిగి అకౌంట్ వివరాలు మార్చడానికి వినియోగదారుడికి యాక్సెస్ లభిస్తుంది. ఇమెయిల్‌కి అకౌంట్‌ను లింక్ చేయలేకపోయినా.. పాస్‌వర్డ్ మార్చినా.. యూజర్లు తమ అకౌంట్‌కు లాగిన్ లింక్ లేదా సెక్యూరిటీ కోడ్ కోసం ఇన్‌స్ట్రాగ్రామ్‌ను సంప్రదించవచ్చు.
* లాగిన్ లింక్ కోసం రిక్వెస్ట్
మొదట ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి, ఆండ్రాయిడ్‌లో అయితే లాగిన్ పేజీలో గెట్ హెల్ప్ లాగింగ్ ఇన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఐఫోన్ లేదా వెబ్‌బ్రౌజర్‌లో అయితే ఫర్గాట్ పాస్‌వర్డ్? ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వినియోగదారులు తప్పనిసరిగా యూజర్ నేమ్, ఇమెయిల్ అడ్రెస్, అకౌంట్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్ ఎంటర్ చేసి నెక్ట్స్ బటన్‌పై క్లిక్ చేయాలి.
అకౌంట్‌కు సంబంధించి, ఫోన్, ఇమెయిల్, యూజర్‌నేమ్‌కు యాక్సెస్ లభించకపోతే, ఆ తర్వాత లాగిన్‌కి ఉపయోగించిన వివరాలను ఎంటర్ చేసి కాంట్ రీసెట్ పాస్‌వర్డ్? ఆప్షన్ సెలక్ట్ చేసుకొని, నెక్ట్స్ బటన్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత వినియోగదారులు తప్పనిసరిగా వారి ఇమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ సెలక్ట్ చేసుకుని, నెక్ట్స్ బటన్ క్లిక్ చేయాలి. అనంతరం వినియోగదారులు ఇమెయిల్ లేదా SMSలోని లాగిన్ లింక్ వస్తుంది. ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత ఆన్ స్క్రీన్‌పై కనిపించే సూచనలు ఫాలో అవ్వాలి. ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ రీసెట్ అవుతాయి.
దిఈ జాగ్రత్తలు ముఖ్యం
హ్యాకింగ్ బారిన పడకుండా సోషల్ మీడియా అకౌంట్లకు టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్లను వినియోగదారులు ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. పాస్‌వర్డ్‌లను వీలైనంత స్ట్రాంగ్‌గా పెట్టాలని సూచిస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్‌లు, కుటుంబ సభ్యుల పేర్లు, ఇష్టమైన ప్రాంతాలు, వస్తువల పేర్లు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. ఇలాంటి పేర్లతో పాస్‌వర్డ్‌లు పెడితే హ్యాకర్లు సులువు గా గుర్తించే ప్రమాదం ఉందన్నారు.