నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుడ్ న్యూస్(Good News) చెప్పింది. పలు పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్లను విడుదల చేసింది.
ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో గుడ్‌న్యూస్ చెప్పనుంది. 2022 సంవత్సరానికి సంబంధించిన క్లర్క్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఎస్బీఐ ఈ నెలలో ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది. అంటే మరో రెండు వారాల్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. SBI క్లర్క్ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగార్థులు ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ వివరాల కోసం అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ఎస్బిఐ.కో .ఇన్ ని తనిఖీ చేస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే తేదీలు, పరీక్ష విధానం, అర్హతలు, ఇతర ముఖ్యమైన అప్‌డేట్స్ అన్నీ ఎస్బిఐ క్లర్క్ 2022 నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. క్లర్క్ రిక్రూట్‌మెంట్ పరీక్షను స్టేట్ బ్యాంక్ రెండు దశల్లో నిర్వహిస్తుంది. మొదటి దశలో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. తర్వాత LPT పేరుతో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ సిలబస్
ప్రిలిమ్స్ పరీక్షల సిలబస్‌లో 3 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ సెక్షన్లు ఉంటాయి. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ ఎగ్జామ్‌లో నాలుగు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సెక్షన్ ఆఫీసర్ / కోర్టు ఆఫీసర్ / సెక్యూరిటీ ఆఫీసర్ / అకౌంట్ ఆఫీసర్ పోస్టులు 09 ఖాళీగా ఉన్నాయి.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 13 ఖాళీగా ఉన్నాయి.
కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు – 11
ఓవర్ సీర్ పోస్టులు – 01
అసిస్టెంట్స్ అండ్ ఎగ్జామినర్ పోస్టులు -27
టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ పోస్టులు – 36
అసిస్టెంట్ ఓవర్ సీర్ పోస్టులు -01
డ్రైవర్ పోస్టులు -135
స్టెనోగ్రాఫర్ పోస్టులు – 170
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు – 113
కాపీయిస్ట్ పోస్టులు – 209
రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు – 20
ప్రాసెస్ సర్వర్ పోస్టులు – 1520
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు – 1655
ఇలా మొత్తం 10 కేటగిరీల్లో నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి. మొత్తం 3600లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 22-10-2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 11-11-2022 రాత్రి 11:59 గంటలలోపు
అప్లికేషన్ ఫీజు.. జనరల్ , బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.
వయోపరిమితి (01-07-2022) నాటికి..
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఈ వయోపరిమితి అనేది కేటగిరీల వారీగా మారుతాయి.
ఆఫీస్ సబ్ ఆర్టినేట్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే..
అర్హత .. కనీసం ఏడో తరగతి పూర్తి చేసి.. తెలుగు రాయడం, చదవడం వస్తే సరిపోతుంది.
ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు..
అనంతపురం 92, చిత్తూరు 168, తూర్పు గోదావరి 156, గుంటూరు 147, వైఎస్ఆర్ కడప 83, కృష్ణ 204. కర్నూలు 91, నెల్లూరు 104, ప్రకాశం 98, శ్రీకాకుళం 87, విశాఖపట్నం 125, విజయనగరం 57, పశ్చిమ గోదావరి 108.
ప్రధాని మోదీ ..
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులకు మరో నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీనికి సంబంధించి పోస్టులు 135 ఖాళీగా ఉన్నాయి. వీటికి దరఖాస్తుల ప్రక్రియ అనేది అక్టోబర్ 29, 2022 నుంచి నవంబర్ 15, 2022 వరకు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. హైకోర్టులో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పై నోటిఫికేషన్స్ కు సంబంధించి పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.