ప్రభుత్వం దసరా కానుక.. 14 కోట్ల మంది అకౌంట్లలోకి డబ్బులు?

అంతా అనుకున్నట్టుగానే జరిగితే.. కేంద్ర ప్రభుత్వం దాదాపు 14 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్లలో   డబ్బులు  జమ చేయనుంది.

అంతా సవ్యంగా జరిగితే విజయదశమికి ముందే దాదాపు 14 కోట్ల మంది బ్యాంకు ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ చేయనుంది. ఇందులో, పీఎం కిసాన్ యోజన కింద 12వ వాయిదా మరియు 7వ వేతన సంఘం కింద అలవెన్సులు ఉన్నాయి.

విజయదశమి కన్నా ముందే ఈ బెనిఫిట్ చాలా మందికి అందనుంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కేంద్ర కేబినెట్ మీటింగ్ రేపు జరగనుంది. సెప్టెంబర్ 28న కేబినెట్ సమావేశం ఉంది. ఇందులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. మోదీ ప్రభుత్వం రేపటి కేబినెట్ సమావేశంలో డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు

భారత ప్రభుత్వం ఈసారి డీఏను 4 శాతం మేర పెంచొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే డియర్‌నెస్ అలవెన్స్ 38 శాతానికి చేరుతుంది. దీని వల్ల దాదాపు కోటి మందికి ప్రయోజనం కలుగనుంది. సెప్టెంబర్ నెల జీతంతో పాటుగా ఈ డీఏ పెంపు ప్రయోజనాలు ఉద్యోగులకు లభించే అవకాశం ఉంది. అలాగే జూలై, ఆగస్ట్ నెల అరియర్స్ కూడా రావొచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 48 లక్షలుగా, పెన్షనర్ల సంఖ్య 68 లక్షలుగా ఉంది.

అలాగే మరోవైపు పీఎం కిసాన్ స్కీమ్ కింద అన్నదాతలకు 12వి విడత డబ్బులు రావాల్సి ఉంది. ఈ స్కీమ్ కింద దాదాపు 12 కోట్ల మందికి పైగా డబ్బులు అకౌంట్లలో జమ అవుతాయి. రూ. 2 వేలు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయో కచ్చితంగా తెలీదు. అయితే దసరా కన్నా ముందుగానే డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ కావొచ్చనే అంచనాలు ఉన్నాయి.

కాగా కేంద్ర ప్రభుత్వం 2019లో రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా రైతులకు ఏటా రూ. 6 వేలు లభిస్తాయి. ఈ డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున ఈ డబ్బులు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు 11 విడతల డబ్బులు వచ్చాయి. ఇప్పుడు 12వ విడత డబ్బులు రావాల్సి ఉంది. 12 కోట్ల మందికి పైగా రైతులకు ఈ డబ్బులు లభించనున్నాయి. అంటే ఈ 12 కోట్ల మందికి పైగా రైతులు, కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు కలుపుకుంటే దాదాపు 14 కోట్ల మంది బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *