వెహికల్ లోన్ కోసం ఎదురు చూస్తున్న వారికీ సూపర్ గుడ్ న్యూస్.. అదేమిటంటే?

సాధారణంగా వాహనాలు కొనుగోలు చేయడానికి లేదంటే ఇంటిని నిర్మించుకోవడానికి లోన్ల కోసం బ్యాంకుల చుట్టూకష్టపడి తిరుగుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు బ్యాంకు లోన్ రావడానికి రెండు మూడు రోజులు కూడా సమయం పడుతూ ఉంటుంది.

వాణిజ్య వాహన రుణాలు అనేది రుణగ్రహీతలకు, సాధారణంగా స్వయం ఉపాధి పొందిన వ్యక్తులు, ట్రస్టులు, భాగస్వామ్య సంస్థలు, సంస్థలు మొదలైన వాటికి వాణిజ్య లేదా వ్యాపార ప్రయోజనాల కోసం వాహనాల కొనుగోలు కోసం అందించే రుణాలు. రవాణా వ్యాపారంలో నిమగ్నమైన వారు ఈ కార్ లోన్‌లను పొందుతారు. బస్సులు, ట్రక్కులు, టిప్పర్లు, ట్యాంకర్లు, తేలికపాటి మరియు చిన్న వాణిజ్య వాహనాలను కొనుగోలు చేయడానికి వాణిజ్య వాహన రుణాన్ని ఉపయోగించవచ్చు

అయితే ఇలా బ్యాంకుల చుట్టూ కారం తిరిగే ఓపిక లేక ఏదైనా ఈజీ ప్రాసెస్ ఉంటే బాగుండు అని కస్టమర్లు అనుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఒక ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే..

తాజాగా ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీస్ కస్టమర్ లకు ఒక చక్కటి శుభవార్తను తెలిపింది. తన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఇక పై మహీంద్రా కస్టమర్ లకు లోన్లు ఈజీగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇకపై భాగస్వామ్యంతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్యాసింజర్‌ వాహనాలు, త్రీ వీలర్, ట్రాక్టర్ , వ్యాపార వాహనాల లోన్ కేటగిరీల కోసం మహీంద్రా ఫైనాన్స్‌ కు లీడ్ రిఫరల్ సేవలను అందిస్తోంది.

అయితే ఇప్పటికే ఉన్న మహీంద్రా ఫైనాన్స్ కస్టమర్‌ల కు పోస్టాఫీసు లలో నగదు ఈఎంఐ డిపాజిట్ సౌకర్యాన్ని అందించనుంది. కాగా ఈ సేవలను మొదటగా మహారాష్ట్ర అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్‌లలో అందించనున్నారు. అయితే రాబోయే నాలుగు లేదా ఆరు నెలల్లో రెండు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాలలో కూడా విస్తరించాలని భావిస్తున్నారు. దీంతో పేమెంట్స్ బ్యాంక్ కూడా తన ఫైనాన్షియల్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో సర్వీసులను విస్తరించాలని భావిస్తోందట.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *