చేపల వేటకు వెళ్లిన జాలరికి పంట పండింది.. వలలో చిక్కిన గోల్డ్‌ ఫిష్‌.. అంతకుమించి..

గోల్డ్‌ కలర్‌లో అక్వేరియంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండే గోల్డ్‌ ఫిష్‌ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రూపాయి కాయిన్‌ అంత సైజులో ఉండే ఈ చిన్ని చేప నీటి తొట్టిలో ఎంతో చలాకీగా అటూ, ఇటూ కదులుతూ అందరినీ ఆకర్షిస్తుంటుంది.

కానీ, ఇదే గోల్డ్ ఫిష్ 30 కిలోల బరువుతో, పెద్ద పరిమాణంలో ఉంటుందంటే నమ్ముతారా?.. కానీ, నమ్మాలి.. ఎందుకంటే ఫ్రాన్స్ లో ఓ జాలరి వలకు ఈ 30 కిలోల పేద్ద గోల్డ్‌ ఫిష్‌ దొరికింది. ధర కూడా కోట్లలో పలుకుతుందని అంచనా వేశాడు.

సాధారణంగా గోల్డ్ ఫిష్ అంటే చిన్నసైజు చేప అనే విషయం అందరికీ తెలిసిన విషయం. కానీ, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ఫిష్ జాలరి వలకు చిక్కడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద ”క్యారట్ తన వలలో పడటంతో ఆ జాలరి ఆనందానికి అవధుల్లేవు. చేపైతే దొరికింది కానీ ఇంత పెద్ద చేపను తాను పట్టుకోగలనని అనుకోలేదని చెప్పాడు. బ్లూవాటర్ లేక్స్ ఫేస్ బుక్ పేజీ ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫిష్‌కి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంత పెద్ద చేపను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా, గతంలో అమెరికాలోని మిన్నసొట్టాలో దొరికిన గోల్డ్‌ఫిష్ కన్నా ఇది సుమారు 14 కేజీల ఎక్కువ బరువు ఉంది. ఫ్రాన్స్‌లోని షాంపేన్‌లో ఉన్న బ్లూవాటర్ సరస్సులో ఆండీ వలకు ఈ చేప చిక్కింది. లెదర్ కార్ప్‌, కోయి కార్ప్ కు చెందిన హైబ్రిడ్ రకమే ఈ భారీ చేప. దాదాపు 25 నిమిషాల వేట తర్వాత ఆండీకి గోల్డ్‌ఫిష్ దొరికింది.

అదృష్టం అతనికి లక్కలా అతుక్కున్నట్లుంది. లేదంటే చేపల కోసం వల వేస్తే యాపిల్ ఐ ఫోన్స్ దొరకటమేంటి? చిత్రం కాకపోతే..కానీ అదృష్టవంతుడ్ని చెడగొట్టేవాడు…దురదృష్టవంతుడ్ని బాగు చేసేవాడు ఉండని పెద్దలు అంటుంటారు. అందుకేనేమో..ఓ జాలరి చేపల కోసం వల వేస్తే ఏకంగా ఐ ఫోన్ల గుట్టే దొరికింది. ప్రతీరోజులాగానే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ జాలరికి వ‌ల‌లో లక్షలు విలువ చేసే ఐఫోన్లు, టాప్ టాపులు దొరికాయి. అవేంటో తెలిసిన సదరు జాలరి ఆనందం పట్టలేక ఒక్కసారిగా పడవలో ఎగిరి ఎగిరి గెంతులేశాడు. ఇండోనేషియాలోని బెలితుంగ్ ప్రాంతంలోని జాలరికి ఐఫోన్ల రూపంలో లక్ లక్కలాగా అతుక్కుంది.

ఇండోనేషియాలోని బెలితుంగ్ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లటం..వలలో పడ్డ చేపల్ని అమ్ముకోవటం చేస్తుంటాడు. రోజులాగానే పడవ వేసుకుని సముద్రంలోకి వెళ్లాడు. సముద్రంలో వల విసిరాడు. కాసేపటికి లాగాడు. వల బరువుగా అనిపించింది. ఆహా చేపలా భారీగా పడ్డాయేమో..ఈరోజు నా పంట పడింది అనుకున్నాడు. ఉత్సాహంగా వల లాగాడు. వల మొత్తం లాగిన తర్వాత అత‌ను చూసేస‌రికి అందులో చేప‌ల‌కు బ‌దులు ఏవో పెట్టెలు క‌నిపించాయి. అవిచూసిన అతను షాక్ అయ్యాడు. ఎక్కువ చేపలు పడ్డాయనుకుంటే ఈ పెట్టెలేంటిరా బాబు నా కష్టమంతా గంగపాలు అయిపోయింని బాధపడ్డాడు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *