వాట్సాప్‌లో కొత్త ఫీచర్ – ఇకపై కాల్స్‌ను కూడా!

వాట్సాప్ త్వరలో మరో ఫీచర్‌ను తీసుకురానుంది. అదే కాల్స్‌కు నోటిఫికేషన్స్‌ను డిజేబుల్ చేయడం. కాల్ నోటిఫికేషన్లను కూడా మ్యూట్ చేసేందుకు ఇది వినియోగదారులను అనుమతించనుంది.

తద్వారా ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు కాల్ నోటిఫికేషన్స్‌తో డిస్టర్బ్ కాకుండా ఉండవచ్చు.

కొన్ని సార్లు వాట్సాప్ డీఎన్‌డీ ఫీచర్ కూడా టెక్నికల్ గ్లిచెస్ కారణంగా ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడు ఈ ‘డిస అబ్లె నోటిఫికెషన్స్ ఫర్ కాల్స్’ ఫీచర్ ఉపయోగపడనుంది. వాబీటాఇన్ఫో  కథనం ప్రకారం విండోస్ 2.2250.4.0 అప్‌డేట్‌లో ఈ ఫీచర్ మొదటిసారి కనిపించింది.

వాట్సాప్ ‘డిస అబ్లె నోటిఫికెషన్స్ ఫర్ కాల్స్’ ఎలా ఉపయోగించాలి
మొదటగా వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి.
సెట్టింగ్స్‌లోకి ఎంటర్ అవ్వాలి.
నోటిఫికేషన్స్‌పై క్లిక్ చేయాలి.

అక్కడ డిజేబల్ నోటిఫికేసన్స్ ఫీచర్ మీకు అందుబాటులో ఉందో లేదో చూడండి. ఒక వేళ ఉంటే ఆ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బీటా యూజర్లకు అప్‌డేట్ ఇచ్చారు కాబట్టి త్వరలో మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ ఇటీవలే వినియోగదారుల కోసం పర్సనలైజ్డ్ 3డీ అవతార్‌లను అందుబాటులోకి తెచ్చింది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్రెండు బిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులతో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా ఉంది.

“మేము వాట్సాప్‌కు అవతార్‌లను తీసుకువస్తున్నాము. ఇప్పుడు మీరు మీ అవతార్‌ను చాట్‌లలో స్టిక్కర్‌గా ఉపయోగించవచ్చు. మా అన్ని యాప్‌లలో మరిన్ని స్టైల్స్ త్వరలో వస్తాయి” అని జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ పోస్టులో రాశారు.

అవతార్ అనేది వినియోగదారుడి డిజిటల్ వెర్షన్. దీన్ని విభిన్నమైన హెయిర్ స్టైల్స్, ముఖ లక్షణాలు, దుస్తులను కలపడం ద్వారా సృష్టించవచ్చు. వాట్సాప్‌లో వినియోగదారులు ఇప్పుడు వారి పర్సనలైజ్డ్ అవతార్‌ను వారి ప్రొఫైల్ ఫోటోగా ఉపయోగించవచ్చు. అనేక విభిన్న భావోద్వేగాలు, చర్యలను ప్రతిబింబించే 36 స్టిక్కర్‌లలో ఒకదాని నుండి ఎంచుకోవచ్చు.

“అవతార్‌ను పంపడం స్నేహితులు, కుటుంబ సభ్యులతో భావాలను పంచుకోవడానికి వేగవంతమైన, ఆహ్లాదకరమైన మార్గం. ఇది మీ నిజమైన ఫోటోను ఉపయోగించకుండా మరింత ప్రైవేట్‌గా అనిపిస్తుంది.” అని వాట్సాప్‌తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *