అదనంగా ఆదాయం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా?
ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా మరిన్ని ఆదాయ మార్గాలను వెతుకుతున్నారా? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) మీకు అద్భుతమైన అవకాశం ఇస్తోంది. ఐపీపీబీ బిజినెస్ కరస్పాండెంట్స్‌ని నియమించుకుంటోంది. ఇండివిజ్యువల్ బిజినెస్ కరస్పాండెంట్స్‌ని నియించడానికి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది
ఆసక్తి గల వారు దరఖాస్తు చేయొచ్చు. తమ బ్యాంకింగ్ సేవల్ని విస్తరించేందుకు, మరికొందరు కస్టమర్లకు సేవలు అందించడం కోసం ఐపీపీబీ బిజినెస్ కరస్పాండెంట్స్‌ని నియమిస్తోంది. మరి ఐపీపీబీ బిజినెస్ కరస్పాండెంట్ కావాలంటే ఏం చేయాలి? ఎవరు అప్లై చేయాలి? ఎలా దరఖాస్తు చేయాలి? తెలుసుకోండి
రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు, రిటైర్డ్ టీచర్లు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, పబ్లిక్ కాల్ ఆఫీస్ ఆపరేటర్లు, కిరాణా షాపులు, మెడికల్ షాపులు నిర్వహించేవారు, భారత ప్రభుత్వానికి చెందిన చిన్నమొత్తాల పొదుపు పథకాల ఏజెంట్లు, ఇన్స్యూరెన్స్ ఏజెంట్లు, పెట్రోల్ పంప్ ఓనర్లు, కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు అప్లై చేయొచ్చు.
వీరితో పాటు ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు, తినుబండారాల స్టాల్స్ నిర్వహించేవారు, బ్యాంకులతో కలిసి పనిచేస్తున్న స్వయం సహాయక బృందాలు ఐపీపీబీ బిజినెస్ కరస్పాండెంట్ పోస్టుకు దరఖాస్తు చేయొచ్చు. ఐపీపీబీ అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఐపీపీబీ బిజినెస్ కరస్పాండెంట్‌గా నియమితులయ్యేవారు బ్యాంకింగ్ సేవల్ని అందించాల్సి ఉంటుంది
ఆసక్తిగల వారు ముందుగా హెచ్టిటిపిఎస్://డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఐపిపి బోన్లైన్.కం వెబ్ /ఐపిపి/బిజినెస్ -కరెస్పాండెంట్ -అడ్వేర్దిజెమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వివరాలన్నీ చదివిన తర్వాత అదే పేజీలో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసిన తర్వాత సర్కిల్ హెడ్ లేదా బ్రాంచ్ హెడ్‌కు ఫామ్ సబ్మిట్ చేయాలి
ఐపీపీబీ బిజినెస్ కరస్పాండెంట్ అందించే సేవల్ని బట్టి ఐపీపీబీ నుంచి ప్రోత్సాహకాలు ఉంటాయి. ముందుగానే నియమనిబంధనల్ని అంగీకరించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను సర్కిల్ లేదా బ్రాంచ్ ఆఫీస్‌లో తెలుసుకోవచ్చు. టెన్త్ క్లాస్ పాస్ కావడంతో పాటు 18 ఏళ్లు పూర్తైనవారు దరఖాస్తు చేయొచ్చు
కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ పరిధిలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి. 2017లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 650 పైగా ఐపీపీబీ బ్రాంచ్‌లు ఉన్నాయి
బ్యాంకులు అందిస్తున్నట్టుగానే ఐపీపీబీ బ్రాంచ్‌లు సేవలు అందిస్తాయి. పలు రకాల సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. ఐపీపీబీ యాప్ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. లోన్స్, ఇన్స్యూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పాటు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.