చిన్నారి ప్రాణాలు రక్షించిన యాపిల్ వాచ్..!

     

సాంకేతికత వల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అది ఉపయోగించుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల అమెరికాలో ఓ పశువైద్యుడు యాపిల్‌ స్మార్ట్‌వాచ్‌ సాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడటం విశేషం. ఓ మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం:

డా.రే ఎమర్సన్‌ యాపిల్‌ స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనకు గుండె కొట్టుకోవడంలో తేడాలు వచ్చి సమస్య ఏర్పడింది. మొదట ఆయన సమస్యను గుర్తించలేకపోయారు. కొద్ది సేపటికి ఎమర్సన్‌ చేతికి పెట్టుకున్న యాపిల్‌ స్మార్ట్‌వాచ్‌ అతడి హృదయ స్పందనలు సరిగా లేవని నోటిఫికేషన్స్‌ అందించింది.

ఆ నోటిఫికేషన్‌ అందిన వెంటనే అతడు అప్రమత్తమై సమీపంలోని సెయిండ్‌ డేవిడ్‌ వైద్య కేంద్రానికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం శస్త్రచికిత్స చేసేందుకు దారి తీసింది. దీంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత కోలుకున్న తర్వాత అతడు మీడియాతో మాట్లాడుతూ తాను ఆ వాచ్‌ను చాలా చౌక ధరకు కొన్నానని కానీ ఇప్పుడు అది తన దృష్టిలో వెలకట్టలేనిదని అభిప్రాయపడ్డారు. ఈ వాచ్‌ల సాయంతో ఇప్పటికే యూఎస్‌లో చాలా మంది హృదయ సంబంధ సమస్యలు తెలుసుకుని అప్రమత్తమవుతున్నారని ఆ మీడియా సంస్థ వెల్లడించింది.

Apple టెక్నాలజీ ప్రజల జీవితాలను రక్షించడంలో అనేక సార్లు ఉపయోగపడింది. ఈసారి ఒక బాలిక కుటుంబం పిల్లల్లో అరుదుగా కనిపించే క్యాన్సర్‌ని కనుగొనడంలో apple కంపెనీ వాచ్ సహాయం చేసింది.

అమెరికాలో యాపిల్ వాచ్ ఓ బాలిక ప్రాణాలు కాపాడింది. ఇమాని మైల్స్ (12) అనే చిన్నారి హార్ట్‌బీట్ ఒక్కసారిగా పెరగడంతో ఆమె పెట్టుకున్న యాపిల్ వాచ్ అలర్ట్ చేసింది. ఇమాని మైల్స్ పెట్టుకున్న ఆపిల్ వాచ్ అసాధారణంగా అధిక హృదయ స్పందన రేటు గురించి 12 ఏళ్ల బాలికను హెచ్చరించడం ప్రారంభించింది.

ఇది గమనించిన మైల్స్ తల్లి జెస్సికా చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లింది. చిన్నారిని పరిశీలించిన వైద్యులు అపెండిక్స్‌లో ట్యూమర్ ఉందని, అది పెరుగుతూ ఇతర అవయవాలకు విస్తరిస్తున్నట్లు గుర్తించారు. ఇది పిల్లలలో చాలా అరుదుగా కనిపిస్తుందని డాక్టర్లు తెలిపారు. క్యాన్సర్ అప్పటికే మైల్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందని వైద్యులు తెలుసుకున్నారు. మిగిలిన క్యాన్సర్‌ను తొలగించడానికి ఆమెకు C.S మోట్ చిడ్రెన్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స చేసి ఆ ట్యూమర్‌ను డాక్టర్లు తొలగించారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *