రిక్షావాలా కూతురు …. మిస్‌ ఇండియా రన్నరప్‌

అందంతో పాటు అభినయంకలగలిపిన వారే సక్సెస్‌ అవుతారు. సాధారణంగా మిస్‌ ఇండియా పోటీల్లో ధనవంతుల పిల్లలే పాల్గొంటుంటారు

ఆ ఆలోచన కూడా చేయరు…

అందాల పోటీలలో నిలవాలంటే అందంగా ఉండాలి. చక్కని ముఖవర్చస్సు కలిగి, అందమైన శరీరాకృతి కోసం ఎంతో కష్టపడాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న విషయం. ప్రపంచానికి తమని తాము పరిచయం చేసుకోవాలని ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించాక ఆలోచనను కార్యరూపంలో పెట్టరు.. కానీ, ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా పోటీల్లో పాల్గొని, రన్నరప్‌గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఓ అమ్మాయి కష్టాల సక్సెస్‌ స్టోరీనే ఇది….

14 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయి….

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం కుషి నగర్‌కు చెందిన మాన్యా సింగ్‌ తండ్రి ఆటో నడుపుతు కుటుంబాన్ని పోషించేవారు. తల్లి కుట్టు మిషన్‌ పని చేసేది. కటిక పేదరికంలో ఉన్నా పిల్లలను మంచిగా చదివించాలని ఆ తల్లిదండ్రులు కలలు కనేవారు. తాము పస్తులు ఉంటూ పిల్లలకు ఆహారం పెట్టేవారు. ఈ కష్టాలను చూసి మాన్యాసింగ్‌ 14 ఏళ్లకే ఇళ్లువదిలి పారిపోయింది. తాను కుటుంబానికి భారమవకూడదని అప్పుడే నిశ్చయించుకుంది. యూపీ నుంచి ముంబై చేరిన మాన్యా చేతిలో చిల్లిగవ్వ లేదు.
అంట్లు శుభ్రం చేస్తూ చదువుకుంటూ….
చదువు ప్రాముఖ్యత తెలిసిన ఆ యువతి స్టడీస్‌ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. చదువుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. కానీ, మంచిగా చదువు కోవాలనే ఆలోచన ఉంది. అందుకోసం ఆ అమ్మాయి హోటళ్లలో ప్లేట్లు శుభ్రం చేయడానికి వెళ్లేది. అలా వచ్చిన డబ్బులతోనే చదువుకునేది. తర్వాత మెళ్లగా ఓ కాల్‌సెంటర్‌లో ఉద్యోగం సంపాదించింది. రాత్రిపూట కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేసుకుంటూ, ఉదయంపూట చదువుకునేది. అప్పుడే అనుకుంది ఎలా అయినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మిస్‌ఇండియా పోటీల్లో ప్రార్టిసిపేట్‌ చేయాలని నిశ్చయించుకుంది.
2020 ఫెమినా మిస్‌ ఇండియా పోటీలో….

కూతురి నిర్ణయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు ఆమెకు అండగా నిలిచారు. వారు ముంబై చేరుకుని కుమార్తెకు చేదోడువాదోడుగా నిలిచారు. ముంబైలో ఎక్కడ అందాల పోటీలు నిర్వహిస్తున్నా మాన్య వెళ్లేది. కానీ, మంచి బట్టలు కూడా కొనుక్కునే స్తోమత లేకపోవడంతో అన్ని అవమానాలే ఎదురవ్వేవి. కొంతమంది డైరెక్ట్‌గానే చెప్పేవారు.. ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకో.. అని. ఇలాంటి అవమానాలు, ఛీత్కారాలే ఆ యువతిలో పట్టుదలను పెంచాయి. ఫలితంగా 22 ఏళ్ల మాన్యాసింగ్‌ 2020 ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. కృషి, పట్టుదల ఉంటె ఆర్థిక పరిస్థితి మనిషి ఎదుగుదల అడ్డంకి కాదని మాన్యాసింగ్‌ను చూస్తే అర్థమవుతుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *