అతడు మనిషి కాదు రాక్షసుడు. మహిళను కిరాతకంగా చంపి ఆమె గుండెతో కూర చేసి మానవుడిగా కాకుండా రాక్షసుడిగా ప్రవర్తించాడు.
అంతటితో ఆగకుండా ఆమె గుండెతో వండిన కూరను తన అత్త కుటుబానికి తినిపించి.. వారిని కత్తులతో నరికాడు. ఇలా మొత్తం ముగ్గురి పొట్టనబెట్టున్నాడా రాక్షసుడు. ఈ దుర్ఘటన అమెరికాలోని ఓక్లాహామాలో జరిగింది. 44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్ జైలు నుంచి విడుదలైన కొన్ని వారాల తర్వాత ఈ హత్యకు పాల్పడ్డాడు. ది ఇండిపెండెంట్ ప్రకారం, 44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్ 2021లో ఈ భయంకరమైన హత్యలకు పాల్పడ్డాడు.
42 ఏళ్ల లారెన్స్ పాల్ అండర్సన్ 2017లో డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్టయ్యాడు. న్యాయస్థానం అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓక్లహోమా పర్డోన్ అండ్ పేరోల్ బోర్డ్ సిఫార్సు మేరకు గవర్నర్ కెవిన్ స్టిట్.. అతడి శిక్షను తొమ్మిదేళ్లకు కుదించారు. అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్న లారెన్స్ జనవరి నెలలో పెరోల్ మీద బయటకు వచ్చాడు. అప్పటి నుంచి ఓక్లహామాలోని చికాషా ప్రాంతానికి చెందిన లారెన్స్ పాల్ అండర్సన్ అనే వ్యక్తి తన అత్త మామ లియో పై, డెస్లీ పైతో కలిసి నివసిస్తున్నాడు.
లారెన్స్‌కు అకస్మాత్తుగా ఏమైందో ఏమో.. తన ఇంటి పక్కన నివసిస్తున్న మహిళ అండ్రియా లేన్ బ్లాంకెన్‌షిప్‌ను కత్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత ఆమె గుండెను పీకేసి.. ఇంటికి తీసుకొచ్చాడు. ఆ గుండెను కోసి, బంగాళా దుంప ముక్కల్లో కలిపాడు. ఆ తర్వాత వాటితో కూడా వండాడు. దాన్ని తన అంకుల్, ఆంటీ, వాళ్ల మనవరాలికి ఆ కూర తినిపించారు. అనంతరం వారిపై కూడా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆయన మామ లియోపై, నాలుగేళ్ల పాప మరణించింది.
అత్త డెస్లీ పై తీవ్రంగా గాయపడింది. దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా మొత్తం ముగ్గురు వ్యక్తులను కిరాతకంగా చంపేశాడు. చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పాల్ అండర్సన్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో అతడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిసింది. పోలీసుల విచారణలో అతడు వింత సమాధానాలు చెప్పాడు. దెయ్యాల నుంచి కాపాడుకునేందుకే ఇలా చేశానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులను ఎందుకు చంపావనే ప్రశ్నకు మాత్రం అతడు బదులు ఇవ్వలేదు. దీంతో పోలీసులు అతడు ఈ హత్యలు డ్రగ్స్ మత్తులో చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా, లారెన్స్ పాల్ అండర్సన్ గతంలో నేర చరిత్ర ఉంది. అతడి మానసిక పరస్థితి సరిగ్గా లేదని పోలీసులు చెప్తున్నారు.
అండర్సన్‌కు ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టిట్ పెరోల్ ఇచ్చినప్పుడు మాదకద్రవ్యాల కేసులో 20 సంవత్సరాల శిక్షను కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అనుభవించాడు. అయితే దర్యాప్తులో అతను పొరపాటున పెరోల్ జాబితాలో ఉంచబడ్డాడని కనుగొన్నారు. అండర్సన్ హత్య, దాడి, వైకల్యంతో నేరాన్ని అంగీకరించిన తర్వాత వరుసగా ఐదు జీవిత ఖైదులను అందుకున్నాడు. దాడిలో గాయపడిన అండర్సన్ అత్త, ఇతర బాధిత కుటుంబాలు ఓక్లహోమా గవర్నర్, జైలు పెరోల్ బోర్డుపై కేసులు పెట్టాయి.