ఉద్యోగులకు దసరా బొనాంజా.. ఈసారి జీతం ఎంత పెరగొచ్చంటే

దసరా పండుగ కన్నా ముందుగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందబోతోంది. కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA Hike) పెంచనుందని నివేదికలు వెలువడుతున్నాయి.

దసరా కల్లా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఒక నిర్ణయాన్ని వెల్లడించొచ్చని పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగులకు (Employees) దసరా పండుగ జొనాంజా లభించినట్లే అవుతుంది. డియర్‌నెస్ అలవెన్స్ ( డీఏ ) పెంపు ప్రకటన వస్తే.. ఉద్యోగుల వేతనాలు (Salary) కూడా పైపైకి చేరుతాయి.కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం మేర పెంచొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ అనేది 34 శాతం నుంచి 38 శాతానికి చేరుతుంది. ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం డీఏను పెంచిన విషయం తెలిసిందే. అప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 3 శాతం మేర పైకి చేరింది. ఇప్పుడు మళ్లీ డీఏ పెరగాల్సి ఉంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రెండు సార్లు డియర్‌నెస్ అలవెన్స్‌ను సమీక్షిస్తూ వస్తుంది.

బైక్, స్కూటర్ కొనేందుకు చౌక వడ్డీకే రుణాలు ఇస్తున్న 20 బ్యాంకులు ఇవే!

ఈ నెల చివర కల్లా కేంద్ర ప్రభుత్వం నుంచి డీఏ పెంపు ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. సెప్టెంబర్ 28న క్యాబినెట్ మీటింగ్ ఉండొచ్చని, ఇందులో డీఏ పెంపు నిర్ణయం తీసుకోవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇలా పెరిగిన డీఏ అనేది జూలై నెల నుంచి అమలులోకి వస్తుంది. డీఏ పెరిగితే.. ఉద్యోగుల వేతనం ఎంత పెరగొచ్చొ ఒకసారి తెలుసుకుందాం.

కేంద్రం అద్భుతమైన అవకాశం.. ఉచితంగానే రూ.75 వేలు పొందండిలా!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు డీఏ 34 శాతంగా ఉంది. 4 శాతం డీఏ పెరిగితే అప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 38 శాతానికి చేరుతుంది. అంటే కనీస మూల వేతనం రూ. 18000గా ఉంటే.. డీఏ రూ. 6840 అవుతుంది. అంటే నెలకు రూ. 720 పెరుగుతుంది. అలాగే గరిష్ట మూల వేతనం రూ. 56,900 అయితే.. 34 శాతం డీఏ ప్రకారం అప్పుడు డీఏ రూ. 19,336 అవుతుంది. డీఏ 38 శాతం అయితే ఇది రూ. 21,622కు చేరుతుంది. అంటే నెలకు రూ. 2276 మేర జీతం పెరుగుతుంది.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కొన్ని నివేదికలు అయితే డీఏ పెంపు 5 శాతం వరకు ఉండొచ్చని పేర్కొంటున్నాయి. అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. దసరా కన్నా ముందే డీఏ పెరిగితే.. ఉద్యోగులకు పండుగ బొనాంజా లభించినట్లు అవుతుంది. కేంద్రం ఏం చేస్తుందో వేచి చూడాలి…

7వ పే కమిషన్ డీఏ పెంపు వార్తలు:

డియర్‌నెస్ అలవెన్స్ కోసం నిరీక్షణ ముగిసింది. కేంద్ర ఉద్యోగులకు కొత్త డియర్‌నెస్ అలవెన్స్ కానుకగా వచ్చే సమయం ఆసన్నమైంది. పండగ సీజన్‌లో ఆయన కోరిక తీరనుంది. దసరా లోపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ కానుక ఇవ్వనుంది. ఈసారి 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ పెంపు) పెరిగింది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్- ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI) డేటా నుండి ఎంత డియర్‌నెస్ అలవెన్స్ పెంచబడుతుందో ఖరారు చేయబడింది. సెప్టెంబరు జీతంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్ కూడా చెల్లిస్తారు.

డీఏ ఎంత ఖరారు అవుతుంది?
AICPI-IW (ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్- ఇండస్ట్రియల్ వర్కర్) మొదటి సగం గణాంకాలు విడుదలయ్యాయి. ఇందులో సూచీ 0.2 పాయింట్లు పెరిగి 129.2కు చేరుకుంది. ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ని నిర్ణయించడానికి ప్రభుత్వం ఈ ఇండెక్స్ డేటాను ఉపయోగిస్తుంది. ఇండెక్స్‌లో పెరుగుదల కారణంగా డీఏలో 4 శాతం పెరుగుదల ఉంది. డియర్‌నెస్ అలవెన్స్‌ను 4% పెంచనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు దీని ప్రయోజనం పొందనున్నారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *