దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించిపోతోంది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అందులో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 11 రాష్ట్రాల్లో వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఐఎండీ తెలిపింది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం..గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ( ఐఎండీ) అంచనా వేసింది. సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఆదివారంపిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలుగు రాష్ట్రాలలో..
ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత కూడా మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయిని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సోమవారం 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
సోమవారం తెలంగాణలోని ఆది ఆదిలాబాద్, నిర్మల్,ఆసిఫాబాద్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, ఖమ్మం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ.
ఇక ఏపీలోను రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షం కురుస్తోంది,… తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసే వర్షం, మరో మూడు రోజుల పాటు మరింత వర్షం న్యూస్9 సిబ్బంది నవీకరించబడింద బంగాళాఖాతంలో అల్పపీడనం అక్టోబర్ వేడితో కలిపి పరిస్థితులు వర్షం మరియు ఉరుములకు కారణమవుతున్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం అక్టోబర్ వేడి పరిస్థితులతో కలిపి వర్షం మరియు ఉరుములతో కూడిన వర్షం కురిపిస్తుందని IMD తెలిపింది. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. అదే సమయంలో రాయలసీమలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో బుధవారం పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. అదే సమయంలో రాయలసీమలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి, యానాం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు వంటి ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది.