ఇంటి నుంచే చేసే వ్యాపారం.. ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం.. ఓ లుక్కేయండి

కరోనా అనంతరం మనందరీ ఆలోచనా విధానంలో విపరీతమైన మార్పు వచ్చింది.

చిన్నదో పెద్దదో ఉద్యోగం కంటే ఏదైనా వ్యాపారం చేయడం ఉత్తమం అని ఈరోజుల్లో చాలామంది అనుకుంటున్నారు. వ్యాపారం చేయాలంటే.. లక్షల్లో పెట్టుబడి ఉండక్కర్లా.. మంచి ఆలోచన కష్టపడే తత్వం ఉంటేచాలు.. చిన్నపాటి పెట్టుబడితో అయినా వ్యాపారం మొదలుపెట్టొచ్చు. వ్యాపారం రంగంలోకి ప్రవేశించి సొంత ఊళ్లో ఉండే చేసే చక్కని బిజినెస్ ఐడియా ఉంది. ఇందులో పెద్దగా ఇన్వెస్ట్ మెంట్ కూడా పెట్టకర్లేదు. ఏమి అవసరంలేదు. అంతేకాక నెలకు లక్షల్లో సంపాదించొచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ అంటే ఎవరు కాందటారు. మరి.. ఆ వ్యాపారం ఏమిటి? ఆ వివరాలు ఏంటో చూద్దామా..

సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మీరు కూడా సొంతంగా బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తే ఈ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు.

ఈ వ్యాపారాన్ని పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేకపోవడం విశేషం. ఇంకా ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఉల్లి ధరలు విపరీతంగా పెరియాన్న వార్తలు మనం ప్రతీ ఏడాది వింటూనే ఉంటాం

ధరలు గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు ప్రతీ వంటకంలోనూ ఉల్లి కనిపించడం అరుదుగా మారుతుంది. అటువంటి పరిస్థితితుల్లో ఉల్లి పేస్ట్ కోసం డిమాండ్ అధికమవుతుంది. మీరు కూడా ఈ అవకాశాన్ని క్యాచ్ చేయాలని భావిస్తే ఉల్లి పేస్ట్ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు

ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఉల్లి ముద్ద తయారీ వ్యాపారంపై ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేసింది. దీని ప్రకారం రూ.4.19 లక్షలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

వ్యాపారం ప్రారంభించడానికి మీ

వద్ద డబ్బు లేకపోతే, మీరు ప్రభుత్వ ముద్ర పథకం నుండి రుణం తీసుకోవచ్చు. కెవిఐసి నివేదిక ప్రకారం ఉల్లి పేస్ట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.4,19,000.

ఇందులో బిల్డింగ్ షెడ్ నిర్మాణానికి రూ.లక్ష, పరికరాలు (ఫ్రైయింగ్ పాన్, ఆటోక్లేవ్ స్టీమ్ కుక్కర్, డీజిల్ ఫర్నేస్, స్టెరిలైజేషన్ ట్యాంక్, చిన్నపాత్రలు, మగ్గులు, కప్పులు మొదలైనవి) కోసం రూ.1.75 లక్షలు ఖర్చు అవుతుంది

ఇది కాకుండా, వ్యాపారాన్ని నడపడానికి రూ.2.75 అవసరం. ఈ యూనిట్ ద్వారా ఏడాదిలో దాదాపు 193 క్వింటాళ్ల ఉల్లి పేస్ట్ ను ఉత్పత్తి చేయవచ్చు. క్వింటాల్‌కు రూ.3,000 చొప్పున, దాని విలువ రూ.5.79 లక్షలు అవుతుంది.

మార్కెటింగ్: ఉల్లిపాయ పేస్ట్ ఉత్పత్తి అయిన తర్వాత, దానిని బెస్ట్ ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. విక్రయానికి మీరు మార్కెటింగ్ పర్సన్స్ సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకోవచ్చు.

వెబ్‌సైట్‌ను సృష్టించడం ద్వారా కూడా మీ ఉత్పత్తిని ప్రమోట్ చేయవచ్చు. మీకు రెండో ఏడాదిని నుంచి మంచి మొత్తంలో డబ్బులు మిగులుతాయి. బిజినెస్ బాగా డెవలప్ అయితే.. ఆదాయం అదే తీరుగా పెరుగుతుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *