ప్రస్తుత రోజుల్లో ఒత్తుగా మృదువుగా జుట్టు కనబడటమే అరుదైపోయింది. అందరికి జుట్టు రాలిపోవడం, జుట్టు పల్చబడటం చూస్తున్నాము. అందుకు తరచూ మనం ఉపయోగించే రసాయనిక షాంపులు, హెయిర్ డ్రైయ్యర్స్, హెయిర్ స్ట్రెటనింగ్ ప్రొడక్ట్స్ , హెయిర్ జెల్స్ ముఖ్య కారణం. జుట్టు పల్చబడినప్పుడు అందం మీద ప్రభావం చూపుతుంది,అందుకే సైంటిఫిక్ గా మనకి తెలిసిన చిట్కాలు వాడి ఒత్తైన కురులు కాపాడుకుందాం.
ఒత్తైన జుట్టును పొందడం ప్రతి ఒక్క అమ్మాయి కళ.. జుట్టు రాలిపోయిన తర్వాత తిరిగి ఒత్తైన జుట్టును పొందడానికి మనం ఇప్పటి వరకూ ఉపయోగించిన కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల దీర్ఘకాలంలో జుట్టు రాలడం దారితీస్తుంది. దాంతో అందం కాస్త పాడవుతుంది. కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ మీ జుట్టును తిరిగి ఒత్తుగా పెరుగేలా చేస్తాయి. జుట్టు రాలడం అరికడుతాయి.బౌన్సీ అండ్ వాల్యూమి హెయిర్ కలిగి ఉండటం వల్ల మీరు చూడటానికి అందంగా కనబడుతారు కాబట్టి, అందుకు ఇప్పుడు మీరు చింతించాల్సిన పనిలేదు. ఇంటి వద్దే బౌన్సీ హెయిర్ పొందడానికి కొన్ని చిట్కాలున్నాయి.
పూర్వకాలంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో చాలామంది యువత తమ జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు. జుట్టు చిట్లిపోవడం, రాలిపోవడం , నిర్జీవంగా మారడం, చుండ్రు వంటి ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
అయితే జుట్టు అందంగా , ఆరోగ్యంగా ఉండాలి అంటే కాఫీ పొడి తో ఒక్కసారి ఇలా చేశారు అంటే కచ్చితంగా మీ జుట్టుకు ఎటువంటి సమస్యలు దరి చేరవు. నిజానికి కాఫీ అలసటను ఒక్క నిమిషంలో తగ్గిస్తుంది . తలనొప్పి నుంచి విముక్తి పొందాలి అంటే స్ట్రాంగ్ కాఫీ ఒకటి తాగితే చాలు.. అంతేనా చదువుకునే పిల్లలకు నిద్ర రాకుండా ఉండడానికి.. పెద్దలకు ఒత్తిడిని తగ్గించడానికి ఈ కాఫీ ప్రథమంగా సహాయం చేస్తూ ఉంటుంది. ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ఈ కాఫీ పొడి ఇప్పుడు జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. మరి కాఫీ పొడితో జుట్టు సంరక్షణ ఎలాగో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
జుట్టు గరుకుగా ఉన్నప్పుడు సిల్కీ గా మార్చగలిగే శక్తికాఫీ పొడికి ఉంటుంది. అలాగే జుట్టు రాలుతున్నప్పుడు జుట్టును ఒత్తుగా మార్చే శక్తి కూడా కాఫీ పొడికే ఉంది. అందుకే కాఫీతో తయారు చేసిన హెయిర్ మాస్క్ మాడు ను శుభ్రంగా ఉంచుతుంది. తద్వారా జుట్టు మూలాలు బలంగా మారి..జుట్టు రాలే సమస్యను నిరోధిస్తాయి. అంతే కాదు చుండ్రు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ముందుగా కాఫీ పొడితో హెయిర్ మాస్క్ ఎలా చేసుకోవాలి అంటే.. ఒక బౌల్ తీసుకొని గుడ్డులోని తెల్ల సనలో మూడు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి వేసి బాగా కలపాలి. పది నిమిషాల పాటు ఈ మాస్క్ పక్కన పెట్టి ఆ తర్వాత వెంట్రుకల కుదుళ్ళ నుంచి చివరి వరకు ఈ మాస్క్ అప్లై చేయాలి
ఇక జుట్టు మొత్తానికి హెయిర్ మాస్క్ అప్లై చేసిన తర్వాత కొన్ని నిమిషాల పాటు వేళ్ళతో స్కాల్ప్ ను సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాలు జుట్టును అలాగే వదిలేసి గాఢత తక్కువ కలిగిన షాంపూతో తల స్నానం చేయాలి.. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా , ఒత్తుగా పెరుగుతుంది. ఒకవేళ కోడిగుడ్డు వాడడం ఇష్టం లేని వాళ్ళు కోడిగుడ్డుకు బదులుగా తేనె ఉపయోగించవచ్చు. అయితే కాఫీ పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టించిన తర్వాత 40 నిమిషాలు ఆగాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.