అదే జరిగితే ఫేస్‌బుక్‌లో ఆ వార్తలన్నీ బంద్ – అమెరికాకే వార్నింగ్ ఇచ్చిన మెటా, ఇంతకీ ఆ గొడవేంటి?

జర్నలిజం బిల్లు ఆమోదం పొందితే మెటాకు నష్టం

ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ఏకంగా అమెరికా ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చింది.

జర్నలిజం కాంపిటీషన్ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్ బిల్లును మెటా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే తమ ఫ్లాట్ ఫామ్ నుంచి అమెరికా వార్తలను తొలగిస్తామని వెల్లడించింది. ఈ చట్టం అమల్లోకి వస్తే అమెరికా మీడియా సంస్థలు ఫేస్ బుక్ లో షేర్ చేసే కంటెంట్ కు సంబంధించి ఫీజును ఎక్కువగా ఆశించే అవకాశం

ఉంటుంది. దీని మూలంగా మెటాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకే, తమ ఫ్లాట్ ఫామ్ లో ఆయా వార్తా సంస్థలు కంటెంట్ పోస్టు చేయడం వల్ల వారికే మేలు కలుగుతుందని వాదిస్తోంది. ట్రాఫిక్ పెరగడం వల్ల సదరు సంస్థలకే లాభం చేకూరుతుందని వెల్లడించింది.

సోషల్ మీడియా యాడ్ రెవెన్యూలో షేర్ డిమాండ్ చేసే అవకాశం

వాస్తవానికి గతంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సైతం ఇలాంటి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయాన్ని ఫేస్ బుక్ అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించింది. ఆస్ట్రేలియా వార్తా సంస్థలకు సంబంధించిన న్యూస్ కంటెంట్ ను ఫేస్ బుక్ తొలగించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అప్పటి నుంచి తమ నిర్ణయాన్ని కూడా ఫేస్ బుక్ వెనక్కి తీసుకుంది. కెనడాలోనూ ఇలాంటి చట్టం అమల్లోకి వచ్చినా, ఆ తర్వాత రద్దు చేశారు. తాజాగా ఇలాంటి చట్టమే అమెరికా సెనేట్ ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్ సెనేట్ జ్యుడీషియరీ కమిటీ సెప్టెంబర్‌లో జర్నలిజం కాంపిటీషన్ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్‌ ను ఆమోదించింది. దీనిని పూర్తి సెనేట్‌ ను ఆమోదించాల్సి ఉంది. ఈ బిల్లుకు ఆమోదం పొందితే సోషల్ మీడియా సంస్థల నుంచి రుసుము డిమాండ్ చేసే అవకాశం వార్తా సంస్థలకు లభిస్తోంది.

మెటా సంస్థ బెదిరింపులు

అటు సోషల్ మీడియా సంస్థలకు వచ్చే యాడ్ రెవెన్యూ నుంచి వార్తా సంస్థలు సైతం వాటా కోరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వార్తల నుంచి ఫేస్ బుక్ పెద్ద ఎత్తున ఆదాయం అందుకుంటుందని వార్తా సంస్థలు ఆరోపిస్తున్నాయి. కరోనా లాంటి కష్ట సమయంలో ఆదాయం లేక వార్తా సంస్థలు ఇబ్బంది పడితే ఫేస్ బుక్ మాత్రం భారీగా ఆదాయం పొందిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే, ఈ వార్తలను మెటా సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. తమ ఫ్లాట్ ఫామ్ లో వార్తలను షేర్ చేయడం మూలంగానే ఆయా సంస్థల సైట్లకు ట్రాఫిక్

పెరుగుతోందని వాదిస్తోంది. ఈ విషయంలో మెటా ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. జాతీయ భద్రతా చట్టంలో భాగంగా అసమగ్రంగా పరిశీలించిన జర్నలిజం కాంపిటీషన్ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్‌ ను సెనేట్ ఆమోదిస్తే అమెరికాకు సంబంధించిన వార్తలను తొలిగించే విషయాన్ని పరిశీలిస్తామని తేల్చి చెప్పింది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *