బిడ్డను ఒంటికి కట్టుకుని… ఆటో నడుపుతూ…

క్రష్‌ లేదా డే కేర్‌ సెంటర్‌లో బిడ్డను వదిలి ఉద్యోగానికి వెళ్లే ఆర్థిక స్థోమత లేని లక్షలాది భారతీయ మహిళల్లో చంచల్‌ శర్మ ఒకరు.పిల్లాడిని డే కేర్‌ సెంటర్లో వదిలేటంత ఆర్థిక స్థోమత లేని ఓ మహిళా ఆటో డ్రైవర్‌ బిడ్డను తన ఒంటికే కట్టుకుని, రోజంతా ఆటో నడుపుతోంది. నోయిడాలో కనిపించే ఆ ఆటో డ్రైవర్‌,27 ఏళ్ల చంచల్‌ శర్మ కథ అందరు మనసులనూ చలింపజేస్తోంది.క్రష్‌ లేదా డే కేర్‌ సెంటర్‌లో బిడ్డను వదిలి ఉద్యోగానికి వెళ్లే ఆర్థిక స్థోమత లేని లక్షలాది భారతీయ మహిళల్లో చంచల్‌ శర్మ ఒకరు. బిడ్డ పుట్టిన నెలన్నర తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టిన చంచల్‌కు ఆ విషయం త్వరలోనే అవగతమైంది. అలాగని ఆమె ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి లేదు. సంపాదనతోనే బిడ్డ ఆలనా పాలనా సాధ్యపడుతుంది. కాబట్టి ఆమె ఓ సాహసోపేతమైన పనికి పూనుకుంది. మగ బిడ్డ అంకు్‌షను తనతో పాటు వెంట తీసుకువెళ్లగలిగే పని కోసం పరిశోధన మొదలుపెట్టిన చంచల్‌ అంతిమంగా ఇ రిక్షానే అందుకు అనుకూలమైనదనే నిశ్చయానికి వచ్చింది. బేబీ క్యారియర్‌ సహాయంతో బిడ్డను తన ఒంటికి కట్టుకుని

ఉదయం 6.30కు ఆటో రిక్షాతో రోడ్డెక్కే చంచల్‌, సెక్టర్‌ 62లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయలాజికల్స్‌ నుంచి సెక్టర్‌ 59లోని లేబర్‌ చౌక్‌ వరకూ ఆరున్నర కిలోమీటర్ల దూరం, ప్రయాణీకులను చేరవేస్తూ ఉంటుంది. ఆ దార్లో కనిపించే ఏకైక మహిళా డ్రైవర్‌ ఆమె.

అభినందనలు, ప్రోత్సాహాలు

”ఆటో ఎక్కే మహిళా ప్రయాణీకులు నా నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఉంటారు. ఇలా స్వయంగా సమస్యను పరిష్కరించుకుని బిడ్డతో పాటు ఆటో నడపడం చూసే ప్రతి ఒక్కరూ నన్ను అభినందిస్తూ ఉంటారు. నాలాంటి పేద మహిళలు కొందరు నేను ఎంచుకున్న మార్గాన్నే ఎంచుకుంటూ ఉండడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది” అంటూ తన అనుభవాన్ని పంచుకుంటున్న చంచల్‌, భర్త నుంచి విడిపోయి తల్లితో పాటు ఉంటోంది. ”మా అమ్మ ఉల్లిపాయలు అమ్ముతుంది. అన్న ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. కాబట్టి బిడ్డ ఆలనా పాలనా చూసే వాళ్లు ఇంట్లో లేకపోవడంతో, నేనీ దారిని ఎంచుకోక తప్పలేదు” అంటూ చెప్తోంది చంచల్‌. పదో తరగతిలోనే చదువుకు స్వస్థి చెప్పిన చంచల్‌, రోజుకు 600 నుంచి 700 రూపాయలు సంపాదిస్తోంది. ఆ సంపాదనలో 300 రూపాయలు, బ్యాటరీతో నడిచే ఆటో లోన్‌కు సహకరించిన ప్రైవేట్‌ ఏజెన్సీకి వెళ్తూ ఉంటాయి.

తప్పని తిప్పలు

”వేసవి లాంటి ప్రతికూల కాలాల్లో బిడ్డను ఆటోలో వెంట తిప్పే వీలుండదు. అలాంటి సమయాల్లో బిడ్డను తల్లి దగ్గర వదిలిపెడుతూ ఉంటాను. కానీ అన్ని సందర్భాల్లో అలా కూడా వీలుపడదు. నెల మొత్తంలో కేవలం మూడు రోజులు మాత్రమే అలా వదలడానికి వీలు పడుతూ ఉంటుంది. అయినా సాయంత్రం వరకూ బిడ్డకు దూరంగా ఉండడం ఏ తల్లికీ సాధ్యపడదు” అంటోంది చంచల్‌ శర్మ. ఏదైనా సరుకుల దుకాణం లేదా బట్టల దుకాణం పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నా, అందుకు సరిపడా డబ్బు లేదు కాబట్టి ఇ ఆటో రిక్షా నడ

పక తప్పడం లేదని చెప్తున్న చంచల్‌ కచ్చితంగా అభినందనీయురాలే!

ఉదయం ఆరున్నర గంటలకు బిడ్డతో పాటు ఆటో నడపడం చూసే ప్రతి ఒక్కరూ నన్ను ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆపైనే వెంటనే అభినందిస్తూ ఉంటారు. నాలాంటి పేద మహిళలు కొందరు నేను ఎంచుకున్న మార్గాన్నే ఎంచుకుంటూ ఉండడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *